రైల్వే అధికారి విత్తనాల వెడ్డింగ్ కార్డ్.. మొకలొస్తాయి..పూలు కూడా పూస్తాయి

  • Published By: nagamani ,Published On : November 23, 2020 / 11:27 AM IST
రైల్వే అధికారి విత్తనాల వెడ్డింగ్ కార్డ్.. మొకలొస్తాయి..పూలు కూడా పూస్తాయి

Hyderabad: invitation wedding cards with seeds : ఇప్పటి వరకూ ఎన్నో వెరైటీ వెరైటీ వెడ్డింగ్ కార్డులు చూశాం. వారి వారి స్థాయిలకు తగినట్లుగా..వినూత్న ఆలోచనలకు అద్దపట్లే వెడ్డింగ్ కార్డులను చూశాం. కానీ ఓ సివిల్స్ అధికారలు వెడ్డింగ్ కార్డు మాత్రం వెరైటీలకే వెరైటీ అని చెప్పాల్సిందే. అటు పర్యావరణ పరిరక్షణ ఇటు ఇంటిలో మోగే పెళ్లి భాజాల కళ్యాణం శుభముహార్తానికి తనదైన స్టైల్లో వినూత్నంగా ఆలోచించి విత్తనాలతో తన పెళ్లి కార్డుని డిజైన్ చేసారు ఓ సివిల్ అధికారి.



రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ ప్రాంతానికి చెందిన ఇండియన్‌ రైల్వేస్‌ ట్రాఫిక్‌ సర్వీసు అధికారి శశికాంత్‌ కొర్రవత్ .. విత్తనాలతో మిలితమైన వివాహ ఆహ్వాన పత్రికను తయారు చేయించారు. తన ఆలోచనలకు అనుగుణంగా ఆగ్రాలోని ఓ స్టార్టప్‌ సంస్థ ద్వారా ఈ విత్తనాల వెడ్డింగ కార్డును తయారు చేయించి అందరి దృష్టిలోనూ శెభాష్ అనిపించుకుంటున్నారు.



జీవితంలో మధురఘట్టాన్ని ఆరంభించే క్రమంలో వినూత్న ఆలోచనతో పర్యావరణ పరిరక్షణకు ముందడుగేశారు శశికాంత్. కూరగాయలు, పూల విత్తనాలతో పెండ్లి పత్రికను తయారు చేయించి వినూత్న ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఈ వెడ్డింగ్‌ కార్డును నీళ్లలో నానబెట్టి మట్టిలో వేస్తే అందులోని విత్తనాలు మొలకెత్తుతాయంటున్నారాయన. ఈ వెడ్డింగ్ కార్డుల్లో బెండ, టమాట, పచ్చిమిర్చితోపాటు చామంతి, బంతి, లిల్లి విత్తనాలను ఉంచారు.



seeds wedding card

తన పెళ్లి సందర్భంగా శశికాంత్ సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సజ్జనార్‌ను కలిసిన శశికాంత్‌ నవంబర్ 28న జరిగే తన వివాహానాకి తప్పకుండా రావాలని ఎకో-ఫ్రెండ్లీ వెడ్డింగ్‌ కార్డును అందజేశారు. ఈ కార్డు ప్రత్యేకతను తెలుసుకున్న సజ్జనార్‌.. శశికాంత్‌ను అభినందించారు. ప్రశంసలతో ముంచెత్తారు. చిన్నప్పటి నుంచి ప్రకృతి అంటే ఇష్టమనీ, తనవంతుగా పర్యవరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఈకో-ఫ్రెండ్లీ వెడ్డింగ్‌ కార్డుకు శ్రీకారం చుట్టానని శశికాంత్‌ చెప్పారు.
https://10tv.in/childless-women-let-priests-walk-on-them-in-hope-of-a-baby/


కాగా ఎవరి ఇంటిలోనైనా పెళ్లి జరిగితే వధువులకు..స్నేహితులకు..ఆత్మీయులకు వెడ్డింగ్ కార్డులు ఇచ్చి పెళ్లికి తప్పకుండా రావాలని కార్డు ఇస్తారు. ఇది సర్వసాధారణం. కానీ అటువంటివి చాలా మంది తమ వెడ్డింగ్ కార్డుల్ని ఇస్తుంటారు. అలా వారి పెళ్లికి వెళతాం. ఈ క్రమంలో కొంతకాలం పోయాక..ఎన్నని ఇంట్లో పెట్టుకంటాం అన్నట్లుగా ఆ వెడ్డింగ్ కార్డుల్ని మనం బైటపారేస్తుంటాం. ఇదికూడా మాగ్జిమమ్ మంది చేసేదే. కానీ అలా పారేసిన కార్డులు మట్టిలో కలిసిపోతుంటాయి.



కానీ సివిల్స్ అధికారి శశికాంత్ ఇచ్చిన కార్డును మాత్రం పారేయబుద్దికాదు. అలా చేయాలనుకోవటానికి మనస్సు ఒప్పదు కూడా. కానీ ఆ కార్డుని నీళ్లలో నానబెట్టి మట్టిలో వేస్తే కూడా ప్రయోజనం కలిగేలా రూపొందించారాయన.నిజంగా భలే ఆలోచన కదూ..విత్తనాల వెడ్డింగ్ కార్డ్..