Nehru Zoological Park: 70 రోజుల తర్వాత నెహ్రూ జూలాజికల్ పార్క్ ఓపెన్

సుదీర్ఘ విరామం తర్వాత ఆదివారం ఓపెన్ చేయగా 2వేల 536మంది వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. కొవిడ్ వ్యాప్తి అరకట్టడానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగా పార్కును మూసివేశారు.

Nehru Zoological Park: 70 రోజుల తర్వాత నెహ్రూ జూలాజికల్ పార్క్ ఓపెన్

Zoo Park

Nehru Zoological Park: 70 రోజుల తర్వాత ఓపెన్ అయింది నెహ్రూ జూలాజికల్ పార్క్. సుదీర్ఘ విరామం తర్వాత ఆదివారం ఓపెన్ చేయగా 2వేల 536మంది వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. కొవిడ్ వ్యాప్తి అరకట్టడానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగా పార్కును మూసివేశారు.

దాదాపు 70రోజుల పాటు మూసి ఉంచిన తలుపులను ఆదివారం ఓపెన్ చేశారు నిర్వాహకులు. కొవిడ్-19 జాగ్రత్త చర్యలు తీసుకుంటూనే ఓపెన్ చేస్తున్నట్లు ప్రెస్ రిలీజ్ లో వెల్లడించారు. ప్రతి విజిటర్ థర్మల్ స్క్రీనింగ్ అయిన తర్వాతే లోపలికి అనుమతిస్తారు. అంతేకాకుండా లోపలకి వచ్చే ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలి.

 

2

2

సోషల్ డిస్టెన్స్ పాటించే విధంగా బుకింగ్ కౌంటర్ల వద్ద మార్కింగులు కూడా చేశారు. దాదాపు 40 శానిటైజర్ డిస్పెన్సర్లను పలు లొకేషన్లలో ఏర్పాటు చేశారు. 50శాతం మాత్రమే కూర్చునేందుకు వీలు కల్పిస్తూ.. బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్, టాయ్ ట్రైన్ ఫెసిలిటీని కల్పించారు.

వీటితో పాటుగా పలు సిగ్నేజ్ బోర్డులను ఏర్పాటు చేసి కొవిడ్ జాగ్రత్తలు తీసుకోవాలంటూ విజిటర్స్ కు గుర్తు చేస్తున్నారు. కొవిడ్ ప్రొటోకాల్ పాటించని వారికి పెనాల్టీ తప్పదని హెచ్చరిస్తున్నారని అధికారులు స్పష్టం చేశారు.