Hyderabad Drugs : ఏం తెలివి..! బ్యాంగిల్స్ మాటున డ్రగ్స్ సప్లయ్ .. హైదరాబాద్‌లో మరో భారీ డ్రగ్ ముఠా అరెస్ట్

హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. భారీ డ్రగ్స్ ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. రూ.3 కోట్ల విలువైన డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Hyderabad Drugs : ఏం తెలివి..! బ్యాంగిల్స్ మాటున డ్రగ్స్ సప్లయ్ .. హైదరాబాద్‌లో మరో భారీ డ్రగ్ ముఠా అరెస్ట్

Hyderabad Drugs : హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. భారీ డ్రగ్స్ ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. రూ.3 కోట్ల విలువైన డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఇద్దరిని అరెస్ట్ చేశారు. న్యూఇయర్ వేడుకలే టార్గెట్ గా నగరంలోకి డ్రగ్స్ తీసుకొచ్చిందీ ముఠా. చెన్నై కేంద్రంగా అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా డ్రగ్స్ తీసుకొచ్చినట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ ఫోర్స్ మెంట్ తో కలిసి పోలీసులు జరిపిన జాయింట్ ఆపరేషన్ లో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టైంది.

Also Read..Hyderabad Drugs Mafia : హైదరాబాద్‌కు మత్తు టెన్షన్.. న్యూ ఇయర్ టార్గెట్‌గా రెచ్చిపోతున్న డ్రగ్స్ ముఠాలు

న్యూ ఇయర్ వచ్చేస్తోంది. దీంతో యువతను టార్గెట్ చేశాయి డ్రగ్స్ ముఠాలు. గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ సరఫరా జరిగిపోతోంది. దీనిపై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు నిఘా పెట్టారు. కేటుగాళ్ల పని పట్టారు. హైదరాబాద్ లో మరో అంతర్జాతీయ భారీ డ్రగ్ ముఠా గుట్టు రట్టు చేశారు. పోలీసులు నిర్వహించిన ఆపరేషన్ లో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.

Also Read..Amit Shah: డ్రగ్స్ స్మగ్లర్లకు డెడ్ లైన్ పెట్టిన అమిత్ షా.. ఆ తర్వాత ఇక ఎవరూ మిగలరట

డ్రగ్స్ ముఠా తెలివితేటలకు పోలీసులే నివ్వెరపోయారు. డ్రగ్స్ తరలించేందుకు కేటుగాళ్లు వినూత్న పద్ధతులను ఆచరించారు. గాజులు, పెళ్లి బట్టల్లో పెట్టి డ్రగ్స్ తీసుకొచ్చింది ముఠా. చెన్నై నుంచి పెళ్లి బృందం మాదిరిగా వేషాలు వేసుకొని హైదరాబాద్ వచ్చింది ముఠా. పక్కా సమాచారంతో పోలీసులు, నార్కోటిక్ అధికారులు రంగంలోకి దిగారు. పెళ్లి బట్టలు, గాజులు, అలంకార వస్తువుల్లో డ్రగ్స్ పెట్టి తీసుకొచ్చిన ముఠా గుట్టును రట్టు చేశారు. వారి నుంచి కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

పోలీసులు బ్యాంగిల్స్ ను క్షుణ్ణంగా చెక్ చేశారు. ఆ బ్యాంగిల్స్ బాగా బరువుగా ఉన్నాయి. దీంతో పోలీసులకు డౌట్ వచ్చింది. ఇందులో ఏదో తిరకాసు ఉందని గ్రహించారు. వారి అనుమానమే నిజమైంది. బ్యాంగిల్స్ బాగా చెక్ చేయగా.. అందులో డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించి షాక్ అయ్యారు. గాజుల బాక్స్ 18 నుంచి 20 కిలోల బరువు ఉంది. దీంతో పోలీసులకు అనుమానం వచ్చింది. గాజుల బాక్స్ అంత బరువుగా ఎందుకు ఉంది? అని సందేహం కలిగింది. అంతే, వెంటనే చెక్ చేశారు. దీంతో డ్రగ్స్ దందా బయటపడింది.

డ్రగ్స్ ముఠాలు రెచ్చిపోతున్నాయి. న్యూయర్ వేడుకలను మస్తుగా ఎంజాయ్ చేసే యూత్ ను టార్గెట్ చేశాయి. ఉత్సాహంగా సాగే సెలబ్రేషన్స్ లో మరింత జోష్ నింపేలా డ్రగ్స్ తో మత్తు ఎక్కించేందుకు ప్లాన్స్ చేస్తున్నారు కేటుగాళ్లు. నిన్నమొన్నటి వరకు విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి డ్రగ్స్ హైదరాబాద్ కు తెప్పించిన ముఠాలు ఇప్పుడు రూట్ మార్చి హైదరాబాద్ నుంచే విదేశాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నాయి.

డ్రగ్స్ ముఠాలను రోజుకో చోట అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. ఎంత కట్టడి చేస్తున్నా కేటుగాళ్లు ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు. రోజుల వ్యవధిలోనే కోట్లాది రూపాయల డ్రగ్స్ ను సీజ్ చేశారంటే.. డ్రగ్స్ ముఠాలు ఎంతగా బరి తెగిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు.