Drugs Smuggling In Bangles : మట్టిగాజులు, చీరలు.. డ్రగ్స్ స్మగ్లర్ల ఖతర్నాక్ ఐడియా, అయినా పట్టేసిన పోలీసులు

మట్టి గాజులు, చీరలు, ఫోటో ఫ్రేముల్లోనూ డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న అంతర్జాతీయ ముఠా గుట్టు రట్టు చేశారు. ఇద్దరు స్మగ్లర్లను అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి రూ.3 కోట్లు విలువ చేసే డ్రగ్స్ సీజ్ చేశారు.

Drugs Smuggling In Bangles : మట్టిగాజులు, చీరలు.. డ్రగ్స్ స్మగ్లర్ల ఖతర్నాక్ ఐడియా, అయినా పట్టేసిన పోలీసులు

Drugs Smuggling In Bangles : న్యూఇయర్ సెలబ్రేషన్స్ కు హైదరాబాద్ ను డ్రగ్స్ స్మగ్లర్లు టార్గెట్ చేశారు. హైదరాబాద్ లో యూత్ లక్ష్యంగా డ్రగ్స్ విక్రయాలకు ప్లాన్ చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా డ్రగ్స్ స్మగ్లింగ్ చేసేందుకు ఖతర్నాక్ ఐడియా వేశారు. ఇందుకోసం మట్టిగాజులు, చీరలు ఎంచుకున్నారు. ఇక తమ పని అయిపోయినట్లే అని సంబరపడ్డారు. కట్ చేస్తే.. కేటుగాళ్లు అడ్డంగా దొరికిపోయారు. పోలీసులు.. డ్రగ్ స్మగ్లర్ల ఆట కట్టించారు.

మరోసారి డ్రగ్ స్మగ్లర్ల ఆట కట్టించారు గ్రేటర్ హైదరాబాద్ పోలీసులు. రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్ల పరిధిలో డ్రగ్స్ స్మగ్లింగ్ పై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇటీవల వరుసగా డ్రగ్స్ గ్యాంగ్స్ పట్టుబడుతున్నాయి. అయితే వారి నుంచి దొరుకుతున్న డ్రగ్స్ కొంతే. దొరకనిది ఇంకెంతో ఉందనే వాదన వినిపిస్తోంది.

Also Read..Hyderabad Drugs Mafia : హైదరాబాద్‌కు మత్తు టెన్షన్.. న్యూ ఇయర్ టార్గెట్‌గా రెచ్చిపోతున్న డ్రగ్స్ ముఠాలు

డ్రగ్స్ సేల్స్ కు కొత్త రూట్లను స్మగ్లర్స్ అన్వేషిస్తుంటే.. వారి భరతం పడుతున్నారు హైదరాబాద్ లోని నార్కోటిక్ ఎన్ ఫోర్స్ మెంట్ వింగ్ పోలీసులు. మట్టి గాజులు, చీరలు, ఫోటో ఫ్రేముల్లోనూ డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న అంతర్జాతీయ ముఠా గుట్టు రట్టు చేశారు. ఇద్దరు స్మగ్లర్లను అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి డ్రగ్స్ సీజ్ చేశారు. దీని విలువ రూ.3 కోట్లు ఉంటుందని తేల్చారు. చెన్నై కేంద్రంగా వివిధ నగరాలకు ఓ ముఠా డ్రగ్స్ సప్లయ్ చేస్తోంది. ఈ ముఠాలో కీలకంగా ఉన్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ , న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ నగరాలకు డ్రగ్స్ సప్లయ్ చేస్తున్నట్లు గుర్తించామని నార్త్ జోన్ డీసీపీ చందనా దీప్తి వెల్లడించారు.

Also Read..Amit Shah: డ్రగ్స్ స్మగ్లర్లకు డెడ్ లైన్ పెట్టిన అమిత్ షా.. ఆ తర్వాత ఇక ఎవరూ మిగలరట

చెన్నైలో తమకు చేరిన డ్రగ్స్ ను చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి వాటిని మట్టిగాజులు, ఫోటో ఫ్రేములు, చీరల్లో ఉంచి.. తనిఖీల్లో గుర్తించలేని విధంగా ప్యాక్ చేసేవారు. వాటిని ప్రైవేట్ వాహనాల్లో హైదరాబాద్ తరలించే వారు. కొరియర్ సంస్థలకు భారీ కమీషన్ ఆశ చూపి.. ఈ డ్రగ్స్ ప్యాకెట్లను ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ చేరవేస్తున్నారు. నిషేధిత పదార్ధాలు ఉన్నట్లు గుర్తించినా.. సాధారణ వస్తువులు గానే నమోదు చేసి స్మగ్లర్లకు సహకరించిన ఆరుగురు కొరియర్ సిబ్బందిని సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. ఫెడెక్స్, మదర్ ఇండియా కొరియర్, అవకాయ.కామ్ వంటి కొరియర్ సర్వీసుల ద్వారా డ్రగ్స్ సప్లయ్ చేశారు ఈ స్మగ్లర్లు. ఒక గ్రాము ఎఫిడ్రిన్ ను రూ.8వేలకు అమ్మారు. కొరియర్ పార్సిల్ పై చిరునామా సరిగ్గానే ఉన్నా పేర్లు మాత్రం కావాలనే తప్పుగా రాస్తున్నారు స్మగ్లర్లు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

బేగంపేటలోని కొరియర్ సంస్థ నుంచి ఖరీదైన డ్రగ్స్ విదేశాలకు చేరుతున్నట్లు అందిన సమాచారంతో కూపీ లాగితే అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టైంది. గాజులను సెట్ గా మార్చి ఇరువైపుల మూతలు బిగించి మధ్యలో డ్రగ్స్ ప్యాకెట్లు ఉంచారు. గాజుల సెట్ 1800 గ్రాముల బరువు ఉండటంతో అనుమానం వచ్చిన పోలీసులు.. తనిఖీలు చేస్తే, ఎఫిడ్రిన్ డ్రగ్స్ స్మగ్లింగ్ వెలుగుచూసింది. రెండేళ్ల వ్యవధిలో వంద కోట్ల రూపాయల విలువైన వంద కేజీల ఎఫిడ్రిన్ ను హైదరాబాద్, పంజాబ్, హర్యానా నుంచి కొరియర్ల ద్వారా విదేశాలకు సప్లయ్ చేశారు. డ్రగ్స్ అంతా కూడా పార్సిల్స్ రూపంలో వస్తున్నాయని పోలీసులు వెల్లడించారు.

చెన్నై నుంచి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ కు వయా హైదరాబాద్ మీదుగా డ్రగ్స్ సప్లయ్ చేస్తున్న ముఠాను పట్టుకున్న పోలీసులు.. 23 సిమ్ కార్డులు, 12 నకిలీ ఆధార్ కార్డులు, 6 సెల్ ఫోన్లు సీజ్ చేశారు. డ్రగ్స్ ముఠా వెనుక ప్రధాన సూత్రధారులను గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు.