Hyderabad Rains : హైదరాబాద్‌ను వణికిస్తున్న వరుణుడు.. మళ్లీ దంచికొట్టిన వర్షం.. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం

హైదరాబాద్ ను వరుణుడు వెంటాడుతున్నాడు. మరోసారి నగరాన్ని వర్షం కుమ్మేసింది. రోడ్లు జలమయం కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు.

Hyderabad Rains : హైదరాబాద్‌ను వణికిస్తున్న వరుణుడు.. మళ్లీ దంచికొట్టిన వర్షం.. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం

Hyderabad Rains : హైదరాబాద్ ను వరుణుడు వెంటాడుతున్నాడు. మరోసారి నగరాన్ని వర్షం కుమ్మేసింది. శనివారం సాయంత్రం కూడా నగరంలో భారీ వాన పడింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్ తో పాటు పలు ప్రాంతాల్లో వర్షం పడటంతో రోడ్లు జలమయం అయ్యాయి. భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. పలు చోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లాయి.

అటు జీహెచ్ఎంసీ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది. శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, చందానగర్ లో కూడా వాన పడింది. మరోవైపు రాజేంద్రనగర్ పరిధిలోనూ జోరుగా వాన పడింది. మోస్తరుగా ప్రారంభమైన వర్షం ఒక్కసారిగా భారీగా కురిసింది. దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

గచ్చిబౌలి, సనత్‌నగర్‌, ఎస్‌ఆర్‌నగర్‌, అమీర్‌పేట్‌, పంజాగుట్ట, మైత్రివనం, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మియాపూర్‌, శేరిలింగంపల్లి, మాదాపూర్‌, రాయదుర్గం, కూకట్‌పల్లి, హైదర్‌నగర్‌, అల్విన్‌కాలనీ, నిజాంపేట్‌, ప్రగతినగర్‌, రాజేంద్రనగర్‌, కిస్మత్‌పూర్‌, గండిపేట, ఉప్పరపల్లి, బోయిన్‌పల్లి, మారేడ్‌పల్లి, తిరుమలగిరి, బేగంపేట్‌, అల్వాల్‌, చిలకలగూడ ప్రాంతంలో భారీ వర్షం కురిసింది.

సరిగ్గా ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలో వర్షం కుమ్మేసింది. దీంతో ఉద్యోగులు, వివిధ పనుల నిమిత్తం బయటికి వచ్చిన ప్రజలు తడిసి ముద్దయ్యారు. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో ప్రయాణికులు మెట్రో రైళ్లను ఆశ్రయించారు. దీంతో మెట్రో స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ కనిపించింది.