Kadem Project: టెన్షన్ పెడుతున్న కడెం ప్రాజెక్టు.. గేట్లు తెరుచుకోకపోవడంతో ఆందోళన

నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు మరోసారి టెన్షన్ పెడుతోంది. గేట్లు తెరుచుకోకపోవడంతో స్థానికులతో పాటు అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Kadem Project: టెన్షన్ పెడుతున్న కడెం ప్రాజెక్టు.. గేట్లు తెరుచుకోకపోవడంతో ఆందోళన

Kadem Project Gates Struck

Kadem Project Gates Stuck: నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు మరోసారి కంగారు పెడుతోంది. భారీ వర్షాలతో ప్రాజెక్టు నీటిమట్టం అంతకంతకు పెరుగుతోంది. కడెం ప్రాజెక్టు క్యాచ్ మెంట్ ఏరియాలో కుండపోత వర్షాలతో ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో ఎక్కువైంది. దీంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసేందుకు అధికారులు శుక్రవారం కసరత్తు ప్రారంభించారు. అయితే అక్కడ ఎక్కువగా ఉన్న తేనెటీగలు విధులకు ఆటంకం కలిగిస్తున్నాయి. మొత్తం 18 గేట్లలో 12 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే 4 గేట్లు మెరాయించడంతో టెన్షన్ మొదలయింది.

6,8,12,16 నెంబర్ల గేట్లు ఎత్తేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నాయి. చాలా కాలంగా గేట్లు తెరకపోవడంతో మొరాయిస్తున్నాయి. 2,3,12 నంబర్ల గేట్లు తెరుచుకోవని సిబ్బంది స్పష్టం చేశారు. మిగతా గేట్లను ఎత్తేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. యంత్రాలతో గేట్లు లేవకపోవడంతో.. మనుషులతో గేట్లను ఎత్తేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. గేట్లు సకాలంలో తెరుచుకోకపోతే ప్రాజెక్టు సమీపంలోని లోతట్టు ప్రాంతాలకు వరద ముప్పు తప్పదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. గేట్లకు మరమ్మత్తులు చేయించడంలో ప్రభుత్వం, అధికారుల అలసత్వం కారణమన్న విమర్శలు విన్పిస్తున్నాయి.

గతేడాది కూడా ఇదేవిధంగా గేట్లు మొరాయించినట్టు స్థానికులు గుర్తు చేస్తున్నారు. వర్షాలకు ముందు గేట్లకు మరమ్మతులు చేయించకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని అంటున్నారు. ప్రాజెక్టు ఇన్ ఫ్లో ఇన్ ఫ్లో లక్ష 70 వేల క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో లక్ష 30 వేల క్యూసెక్కులు గా ఉందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు నిర్మల్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి.

Also Read: రోడ్డుపై నగ్నంగా మహిళలు.. ఇది కేంద్రం వైఫల్యమే, ఆయన చేసే డ్రామా చూస్తే బ్రహ్మానందం కూడా నవ్వుకుంటారు – బెల్లయ్య నాయక్

నిర్మల్ జిల్లాలో వర్షపాతం వివరాలు
అత్యధికం: కుంటాల 124.6 మి.మీ.
అత్యల్పం: లక్ష్మణచాంద: 16.2 మి.మీ.
సరాసరి వర్షపాతం: 57.8 మి.మీ.

మండలాల వారీగా వర్షపాతం వివరాలు

1) కుబీర్ : 99.2 మి.మీ.

2) తానూర్ : 78.6 మి.మీ.

3) బాసర : 45 మి.మీ.

4) ముథోల్ 94.6 మి.మీ.

5) భైంసా 59.6 మి.మీ.

6) కుంటాల 124.6 మి.మీ.

7) నర్సాపూర్ 24.4 మి.మీ.

8) లోకేశ్వరం 38 మి.మీ.

9) దిలవార్పూర్ 41.8 మి.మీ.

10) సారంగపూర్:116.2 మి.మీ

11) నిర్మల్: 44.8 మి.మీ.

12) నిర్మల్ రూరల్: 28.8 మి.మీ.

13) సోన్:19.8 మి.మీ.

14) లక్ష్మణచాంద:16.2 మి.మీ

15) మామడ : 65.2 మి.మీ.

16) పెంబి : 67.6 మి.మీ.

17) ఖానాపూర్ : 37.8 మి.మీ.

18) కడెం పెద్దూర్: 62.4 మి.మీ.

19) దస్తురాబాద్: 34.2 మి.మీ

Also Read: నాలా చాలామంది మహిళలు బీఆర్ఎస్‌లో బాధపడుతున్నారు- కాంగ్రెస్‌లో చేరిన గద్వాల్ జడ్పీ ఛైర్‌పర్సన్ సరిత