Kadiyam Srihari : సీఎం ఆదేశాలు బేఖాతర్.. ప్రభుత్వ కార్యక్రమాలు, సమావేశాలకు నన్ను ఆహ్వానించడం లేదు : కడియం

ఇప్పటికైనా ఆత్మీయ సమావేశాలకు సమాచారం ఇవ్వాలని.. లేకపోతే పార్టీలో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. తాను కేసీఆర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.

Kadiyam Srihari : సీఎం ఆదేశాలు బేఖాతర్.. ప్రభుత్వ కార్యక్రమాలు, సమావేశాలకు నన్ను ఆహ్వానించడం లేదు : కడియం

Kadiyam Srihari (1)

Kadiyam Srihari : బీఆర్ఎస్ పార్టీ స్థానిక నాయకత్వంపై ఆ పార్టీ నేత కడియం శ్రీహరి అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలను కూడా స్థానిక నాయకత్వం బేఖాతర్ చేసిందని కడియం అన్నారు. స్టేషన్ ఘన్ పూర్ నియోజవర్గంలో జరిగే ఆత్మీయ సమావేశానికి తనకు సమాచారం లేదన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం కేంద్రంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో కడియం శ్రీహరి మాట్లాడారు. ఎన్నికలలో తనకు సహాయం చేయబోమని ఎమ్మెల్యే అనడంతో పార్టీ నిర్ణయానికి కట్టుబడి, సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని పని చేశానని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా నిస్వార్ధంగా పని చేశానని తెలిపారు.

‘ఒక్క రూపాయి తీసుకోకుండా మీరు ఒక్కరే నా ఎన్నికలకు పని చేశారని.. పల్ల రాజేశ్వర్ రెడ్డి స్వయంగా అన్నారు’ అని కడియం వెల్లడించారు. ఎన్నికలు వచ్చినప్పుడు, పెద్ద పెద్ద సభలు, సమావేశాలు ఉన్నప్పుడు మాత్రం సహాయం అడుగుతున్నారని తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాలకు, సమావేశాలకు తనకు ఆహ్వానం ఇవ్వడం లేదని పేర్కొన్నారు.

Rajaiah VS kadiyam Srihari : రాజయ్య పిచ్చి వేషాలు .. చిల్లర మాటలు మానకపోతే బండారం అంతా బయటపెడతా : కడియం శ్రీహరి

తనకు అవకాశం ఉన్నా కూడా నిజాయితీగా పని చేశానని తెలిపారు. సొడశపల్లి సమావేశంలో కడియం శ్రీహరి అంటే ఏంటో తెలిసింది అని అన్నారు. ఇప్పటికైనా ఆత్మీయ సమావేశాలకు సమాచారం ఇవ్వాలని.. లేకపోతే పార్టీలో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. అయితే, తాను కేసీఆర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.