Kasani Gnaneshwar : తెలంగాణలో పోటీకి చంద్రబాబు నో అంటే.. టీడీపీకి గుడ్ బై చెప్పే యోచనలో కాసాని జ్ఞానేశ్వర్

రాజమండ్రిలో చంద్రబాబుతో ములాఖత్ కానున్న కాసాని తెలంగాణలో ఎన్నికల్లో పోటీపై చర్చించే అవకాశం ఉంది.

Kasani Gnaneshwar : తెలంగాణలో పోటీకి చంద్రబాబు నో అంటే.. టీడీపీకి గుడ్ బై చెప్పే యోచనలో కాసాని జ్ఞానేశ్వర్

Kasani Gnaneshwar

Updated On : October 25, 2023 / 10:14 PM IST

Telangana TDP – Kasani Gnaneshwar : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎన్నికల ముందే తెలంగాణలో టీడీపీకి షాక్ తగిలే పరిస్థితి కనిపిస్తోంది. కాసాని జ్ఞానేశ్వర్ టీడీపీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో పోటీకి చంద్రబాబు నో అంటే ప్రత్యామ్నాయం ఆలోచన చేసే అవకాశం ఉంది.

ఎన్నికల్లో పోటీకి పార్టీ అధినేత చంద్రబాబు నో అంటారనే అనుమానంతో టీటీడీపీ అధ్యక్షుడు ప్రత్యామ్నాయం వెతుక్కునే పనిలో పడ్డారు. రేపు(గురువారం) రాజమండ్రిలో చంద్రబాబుతో ములాఖత్ కానున్న కాసాని తెలంగాణలో ఎన్నికల్లో పోటీపై చర్చించే అవకాశం ఉంది.

Buddha Venkanna : కొడాలి నానికి ఎన్టీఆర్ దేవుడు అయినప్పుడు ఆయన కుమార్తె భువనేశ్వరి దేవత కాదా? బుద్ధా వెంకన్న

చంద్రబాబు కాదంటే నెక్స్ట్ ఏం చేయాలనే ఆలోచనలో కాసాని ఉన్నట్లు చెబుతున్నారు. కాగా, కాసాని 30 మంది అభ్యర్థులను ఖరారు చేశారు. మరో 63 నియోజకవర్గాల లిస్టు సిద్ధం చేశారు. కాగా, కాసాని జ్ఞానేశ్వర్ బాధ్యతలు స్వీకరించాకే తెలంగాణ టీడీపీకి ఊపు వచ్చింది.