KBR Park Underground Tunnel Road : హైదరాబాద్‌లో మరో అద్భుత నిర్మాణానికి అడుగులు.. కేబీఆర్ పార్క్ కింద అండర్ గ్రౌండ్ టన్నెల్ రోడ్

హైదరాబాద్ లో మరో అద్భుత నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ కింద అండర్ గ్రౌండ్ టన్నెల్ రోడ్డు నిర్మించేందుకు ప్రభుత్వం సిద్దమైంది. ఈ రోడ్డు నిర్మాణం సాధ్యాసాధ్యాలపై ఇప్పటికే అధ్యయనం ప్రారంభమైంది.

KBR Park Underground Tunnel Road : హైదరాబాద్‌లో మరో అద్భుత నిర్మాణానికి అడుగులు.. కేబీఆర్ పార్క్ కింద అండర్ గ్రౌండ్ టన్నెల్ రోడ్

KBR Park Underground Tunnel Road : హైదరాబాద్ లో మరో అద్భుత నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ కింద అండర్ గ్రౌండ్ టన్నెల్ రోడ్డు నిర్మించేందుకు ప్రభుత్వం సిద్దమైంది. ఈ రోడ్డు నిర్మాణం సాధ్యాసాధ్యాలపై ఇప్పటికే అధ్యయనం ప్రారంభమైంది. దేశంలోని పలు టన్నెల్ రోడ్లను పరిశీలించి రిపోర్టు రెడీ చేయనుంది కేసీఆర్ సర్కార్. కేబీఆర్ పార్క్ లోని వృక్ష సంపద, జీవరాశులకు నష్టం లేకుండా ఈ అండర్ గ్రౌండ్ టన్నెల్ నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. దాదాపు 100 అడుగుల లోతున 30 మీటర్ల వెడల్పులో ఈ నిర్మాణం చేపట్టేందుకు రెడీ అయ్యింది. అటు పర్యావరణానికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇక కేబీఆర్ పార్క్ కింద భూగర్భంలో నిర్మాణం కానున్న ఈ టన్నెల్ రోడ్ హైదరాబాద్-సైబరాబాద్ లను కలపనుంది. కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ నుంచి ఎన్ ఎఫ్ సీఎల్ జంక్షన్ వరకు ఈ టన్నెల్ నిర్మాణం సాగనుంది. ఇందుకోసం కేబీఆర్ పార్క్ కింద భూగర్భంలో రెండు మార్గాలలో నాలుగు లైన్లతో ఈ టన్నెల్ నిర్మించనున్నారు. మొత్తం 6.3 కిలోమీటర్ల పొడవున జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 నుంచి కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ వరకు నిర్మించనున్నారు. మరొకటి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 12 నుంచి ఫిలింనగర్ రోడ్ నెంబర్ 45ను కలిపే విధంగా ఈ అండర్ గ్రౌండ్ ఉండబోతోంది. ఈ టన్నెల నిర్మాణంతో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ ప్రాంతాల్లో ట్రాఫిక్ కష్టాలకు బ్రేక్ పడనుంది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

మరోవైపు ఈ టన్నెల్ నిర్మాణం విషయంలో నాణ్యత, మన్నిక విషయాల్లో రాజీలేకుండా ముందుకు వెళ్లబోతోంది ప్రభుత్వం. ఈ టన్నెల్ నిర్మాణం కోసం మూడు కంపెనీలు పోటీపడగా ఆర్వీ అసోసియేట్స్ కంపెనీకి టెండర్ దక్కింది. దీంతో ఈ కంపెనీ అధికారులు జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి ఢిల్లీ, మీరట్ టన్నెల్ రోడ్లను పరిశీలించారు.

అయితే ఈ టన్నెల్ నిర్మాణంపై ప్రభుత్వం మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పర్యావరణవేత్తలు అంటున్నారు. ఈ నిర్మాణంతో వెలువడే వైబ్రేషన్స్.. కేబీఆర్ పార్క్ లోని వృక్ష సంపదకు ఎంతో నష్టం చేస్తాయని చెబుతున్నారు. అలాగే ఆ ప్రాంతంలో అడ్డగోలు నిర్మాణాలతో వచ్చే సమస్యలకు ఈ సొరంగ మార్గం కారణం కాకుండా చూడాలన్నారు. ముందుగా ప్రజల అభిప్రాయం తీసుకుని సమగ్ర శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు పర్యావరణవేత్తలు.

అయితే అందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుని ఈ నిర్మాణం చేపడతామని ప్రభుత్వం చెబుతోంది. ఈ నిర్మాణం వల్ల పంజాగుట్ట-హైటెక్ సిటీ వైపు ట్రాఫిక్ కష్టాలు తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఈ టన్నెల్ పూర్తైతే హైదరాబాద్ భూగర్భంలో మరో అద్భుతం ఆవిష్కృతం కానుంది.