Congress: రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న కేసీఆర్ సన్నిహితుడు శ్రీహరి రావు.. టీపీసీసీ అధ్యక్షుడు ఏమన్నారంటే?

తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి కృతజ్ఞతగా రాబోయే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

Congress: రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న కేసీఆర్ సన్నిహితుడు శ్రీహరి రావు.. టీపీసీసీ అధ్యక్షుడు ఏమన్నారంటే?

Revanth Reddy - Kuchadi Srihari Rao

Updated On : June 14, 2023 / 4:02 PM IST

Congress – Srihari Rao: హైదరాబాద్ లోని గాంధీ భవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) సమక్షంలో పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. నిర్మల్ (Nirmal) జిల్లా బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, సీఎం కేసీఆర్ (KCR) కు అత్యంత సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్న శ్రీహరి రావు తన అనుచరులు, కార్యకర్తలతో కాంగ్రెస్ లో చేరారు. వారికి కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు రేవంత్ రెడ్డి.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజలకు ఏకైక నాయకురాలు సోనియా గాంధీ అని చెప్పారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి కృతజ్ఞతగా రాబోయే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ పార్టీలోకి శ్రీహరి రావుని సాదరంగా స్వాగతం పలుకుతున్నామని తెలిపారు. కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేసేవారికి గుర్తింపు తప్పక దక్కుతుందని రేవంత్ రెడ్డి చెప్పారు. కొందరు పార్టీని వీడితే నాయకులే ఉండరన్నట్లు వ్యవహరించారని తెలిపారు. కానీ, అంతకంటే బలమైన నాయకులు కాంగ్రెస్ లోకి వచ్చారని తెులిపారు.

నిర్మల్ అసెంబ్లీ నియోజక వర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తుందని చెప్పారు. ఇంద్రకరణ్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పటికీ ఆయన నియోజక వర్గం నిర్మల్ లో డబుల్ బెడ్రూం ఇల్లు కట్టించలేకపోయారని తెలిపారు.

Chennamaneni Ramesh: టికెట్ విషయంలో నాకు భయం లేదు.. ఎందుకంటే?: ఎమ్మెల్యే చెన్నమనేని