Bhadrachalam Sitarama : భద్రాచలం సీతారాముల కళ్యాణానికి మండపేట బోండాలు

భద్రాచలం శ్రీ సీతారాముల కళ్యాణానికి మండపేటకు చెందిన భక్తుడు కేవీఏ రామారెడ్డి ప్రత్యేకంగా అలంకరించిన కళ్యాణ బొండాలను రెండు దశాబ్దాలుగా భక్తి పూర్వకంగా నివేదిస్తున్నారు.

Bhadrachalam Sitarama : భద్రాచలం సీతారాముల కళ్యాణానికి మండపేట బోండాలు

Mandapeta Coconut Bondas : భద్రాచలం శ్రీ సీతారాముల కళ్యాణానికి మండపేటకు చెందిన భక్తుడు కేవీఏ రామారెడ్డి ప్రత్యేకంగా అలంకరించిన కళ్యాణ బొండాలను రెండు దశాబ్దాలుగా భక్తి పూర్వకంగా నివేదిస్తున్నారు. తొలిసారిగా 2000 సంవత్సరంలో పెద్ద కొబ్బరి బొండాలను అలంకరించి వాటిపై సీతారాముల పేర్లు రాసి కళ్యాణానికి ముందు రోజు పట్టుకెళ్లి ఇచ్చారు. వాటిని వేదికపై ఉంచారు.

అప్పటినుంచి ఏటా కళ్యాణానికి ముందురోజు అందజేస్తున్నారు. నెల ముందు నుంచి సమీప మండలాల్లోని కొబ్బరి తోటల్లో తిరిగి బొండాలు ఎంపిక చేసుకుని రైతులతో మాట్లాడి వస్తారు. ఉగాది నాటికి ఎంపిక చేసిన వాటిని చెట్లపైనుంచి దింపించి ఇంటికి తీసుకొచ్చి అలంకరిస్తారు.

శ్రీరామనవమికి రెండు రోజుల ముందు సిద్ధం చేసి ముందు రోజు స్వయంగా తీసుకెళ్లి అందజేస్తారు. రాష్ట్ర విభజన తరువాత ఒంటిమిట్ట రామాలయానికి సైతం అందజేస్తున్నారు.