Cheating: భర్త రమ్మన్నాడని నమ్మబలికి చిత్రహింసలు.. రెండేళ్ల చిన్నారికి సిగరెట్లతో వాతలు

భర్తతో గొడవపడి పుట్టింటికి వచ్చిన మహిళను మోసం చేసి వ్యభిచార కూపంలోకి దింపాడు ఓ మోసగాడు. పరిచయస్థుడు.. తరచూ అన్న అని

Cheating: భర్త రమ్మన్నాడని నమ్మబలికి చిత్రహింసలు.. రెండేళ్ల చిన్నారికి సిగరెట్లతో వాతలు

Cheating

Cheating: భర్తతో గొడవపడి పుట్టింటికి వచ్చిన మహిళను మోసం చేసి వ్యభిచార కూపంలోకి దింపాడు ఓ మోసగాడు. పరిచయస్థుడు.. తరచూ అన్న అని పిలిచే వ్యక్తిపై నమ్మకంతో వెళ్లిన మహిళ మానసికంగా, శారీరకంగా కష్టాల్లో ఇరుక్కుపోయింది. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలంలో జరిగింది.

బాధితురాలి కుటుంబసభ్యులు, పోలీసులకు చేసిన ఫిర్యాదు ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలానికి చెందిన మహిళ(21)కు గార్ల మండలానికి చెందిన వ్యక్తితో మూడేళ్ల క్రితం వివాహమైంది. వారికి రెండేళ్ల కుమార్తె ఉండగా కూలీ పనులు చేసుకుంటూ బతుకుతున్నారు.

8 నెలల క్రితం భార్యభర్తల మధ్య గొడవ జరగడంతో మనస్తాపం చెందిన మహిళ.. కూతురిని తీసుకుని పుట్టింటికి వచ్చేసింది. ఈ విషయం తెలుసుకున్న అదే గ్రామానికి చెందిన భూక్యా సర్వేశ్‌ మార్చి నెలలో యువతి పుట్టింటికి వెళ్లి.. ‘నీ భర్త రమ్మంటున్నాడు’ అంటూ మాయమాటలు చెప్పి నమ్మబలికాడు. భర్త పిలిచాడనగానే ఆశపడిన ఆమె.. సర్వేశ్‌తో పరిచయం ఉండటంతో అతనితో బయలుదేరింది. పలుమార్లు రాఖీ కట్టడంతో సోదరుడిగా భావించి కుమార్తెను తీసుకుని అతడి వెంట మరో ఆలోచన లేకుండా హైదరాబాద్‌ బయలుదేరింది.

దిల్‌సుఖ్‌నగర్‌లోని తన గదికి తీసుకువెళ్లిన సర్వేశ్‌పై రెండ్రోజుల తర్వాత అనుమానం వచ్చింది. ఎదురుదాడికి ప్రశ్నించిన ఆమె నుంచి 5 తులాల నగలను లాక్కున్నాడు. చెప్పిన మాట వినాలని తీవ్రంగా కొట్టి సిగరెట్‌తో కాల్చి వాతలు పెట్టేవాడు. తన రెండేళ్ల కుమార్తె వీపుపైనా సిగరెట్లతో కాల్చి తీవ్రంగా హింసించాడు. చెప్పినట్లు చేయకపోతే పాపను చంపేస్తానని బెదిరించాడు. మత్తుమందు ఇచ్చి వ్యభిచారం చేయించాడు.

రోజూ నలుగురైదుగురు వ్యక్తులను తీసుకువచ్చేవాడు. ఓ రోజు ఇంటి యజమానికి అనుమానం వచ్చి సర్వేశ్‌ లేని సమయంలో గది తాళం పగలగొట్టి బయటకు తీసుకొచ్చి వివరాలు ఆరా తీశాడు. సహాయం కోసం ఎదురుచూస్తున్న ఆమె .. ఇంటి యాజమానికి జరిగిందంతా చెప్పింది. అతని దగ్గర ఉన్న కొంత సొమ్ము చేతిలో పెట్టి ఇంటికి వెళ్లిపోమని పంపించేశాడు. పుట్టింటికి చేరిన బాధితురాలు జరిగిన దారుణాన్ని తల్లిదండ్రులకు వివరించింది. బుధవారం గార్ల మండలంలోని పోలీస్ స్టేషన్ కు వెళ్లి జరిగిందంతా చెప్పి కంప్లైంట్ చేశారు.