బీజేపీవి అన్నీ అబద్దాలే…గుట్టువిప్పిన మంత్రి హరీష్ రావు

  • Published By: madhu ,Published On : October 30, 2020 / 02:11 PM IST
బీజేపీవి అన్నీ అబద్దాలే…గుట్టువిప్పిన మంత్రి హరీష్ రావు

Minister Harish Rao Press Meet : దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారంలో బీజేపీ అన్నీ అబద్దాలే చెబుతోందని, నేతలు భారతీయ ఝుటా పార్టీగా మార్చేస్తున్నారని మంత్రి హరీష్ రావు విమర్శించారు. వెయ్యి అబద్దాలు ఆడినా..ఒక ఎన్నిక గెలవాలనే ఆలోచన వారిలో ఉందన్నారు. రాష్ట్ర బీజేపీ నాయకుల నుంచి మొదలుకుని..కార్యకర్త వరకు ఒక్క నిజమైనా మాట్లాడడం లేదని తెలిపారు.



బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, బూత్ స్థాయి వరకు ఉన్న నేత వరకు అబద్దాలు మాట్లాడుతూ..ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. 2020, అక్టోబర్ 30వ తేదీ శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ ఎన్ని అబద్దాలు మాట్లాడింది ? అసలు వాస్తవం ఏంటో ఆయన వివరించారు.

ఝుటా నెంబర్ 1 : టీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడా లేని విధంగా..బీడీ కార్మికులకు రూ. 2,016 ఇస్తోంది. ఇందులో 1600 కేంద్రం ఇస్తుందని, మోడీ పంపుతున్నారని అసత్య ప్రచారం చేస్తోంది. తాను విసిరిన సవాల్ కు ఇంకా స్పందించలేదు. కాంగ్రెస్ పుర్రె గుర్తును ఇస్తే..బీజేపీ 18 శాతం జీఎస్టీ ఇచ్చింది.



ఝుటా నెంబర్ 2 : : కేసీఆర్ కిట్ పథకంలో ఇచ్చే రూ. 13 వేలలో రూ. 6 వేలు ఉన్నాయని, ఇంకో నేత రూ. 8 వేలు ఇస్తున్నామంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అబద్దాని తలోరకంగా చెబుతున్నారు. కేసీఆర్ కిట్ లో కేంద్ర ప్రభుత్వానిది నయా పైస లేదు. నూటికి నూరు శాతం టీఆర్ఎస్ ప్రభుత్వమే ఇస్తుంది.

ఝుటా నెంబర్ 3 : గొర్రెల యూనిట్ లలో రూ. 50వేలు బీజేపీ ఇస్తుందని, రూ. 25 వేలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తుందని ప్రచారం చేస్తున్నారు. దుబ్బాక ప్రజలు చైతన్యవంతులు. నూటికి నూరు శాతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే భరించి అమలు చేస్తున్న పథకం. కనీసం యూనిట్ కాస్ట్ ఎంతనో అవగాహన లేదు. ఒక మనిషికి గొర్రె పిల్లలు ఇవ్వడానికి రూ. లక్షా 25 వేలు యూనిట్ కాస్ట్. ఇందులో 75 శాతం రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తే..25 శాతం లబ్దిదారుడు పెట్టుకుంటున్నాడు. 75 శాతం సబ్సడీ యొక్క విలువ రూ. 93 వేల 750 అయితే..లబ్దిదారుడి కంట్రిబ్యూషన్ రూ. 31 వేల 250. లక్షా 25 వేలు పథకం ఇస్తుంటే అంతా అసత్య ప్రచారం చేస్తోంది. గొర్రెల పథకంలో కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వడం లేదు.



ఝుటా నెంబర్ 4 : రూ. 25 కోట్లతో చేగుంటకు మంజూరైన ఈఎస్ఐ ఆసుపత్రి గజ్వేల్ కు తరలించుకపోయారని బీజేపీకి చెందిన ఓ ఎంపీ ఆరోపించారు. కనీసం ఆసుపత్రి ఎక్కడో చూపించాలి లేదా..అనుమతి అయినట్లు కాగితం చూపిస్తారా ?

ఝుటా నెంబర్ 5 : రేషన్ బియ్యం సబ్సిడీలో 29 రూపాయలు కేంద్రం ఇస్తుందని, ఒక్క రూపాయి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని అంటున్నారు. రేషన్ కార్డు బియ్యంలో సగం మాత్రమే కేంద్రం నుంచి వస్తుంది. మిగతా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. ఇచ్చే సగంలో 5 కిలోలు మాత్రమే ఇస్తుంది. ఇంకో కేజీ ప్రభుత్వం ఇచ్చి..మొత్తం ఆరు కిలోలు ఇస్తుంది.

ఝుటా నెంబర్ 6 : దుబ్బాకకు పాలిటెక్నిక్ కళాశాల మంజూరైందని, శిలాఫలకం ఏర్పాటు చేశారని, హరీష్ రావు సిద్ధిపేటకు తీసుకెళ్లారని అంటున్నారు. మంజూరు కాలేదు. శంకు స్థాపనే కాలేదు.



ఝుటా నెంబర్ 7 : మోటార్లకు మీటర్లు పెట్టాలని సీఎం కేసీఆర్ చూస్తున్నారని అంటున్నారు. ఇంత దిగజారుడు రాజకీయాలు ఉంటాయా ? ఏప్రిల్ నెలలో నూతన విద్యుత్ ముసాయిదా బిల్లు తెచ్చింది కేంద్రం. మే నెలలో రాష్ట్రాలు భరిస్తే…02.5 శాతం ఎఫ్ఆర్ బీఎం అదనంగా రాష్ట్రాలకు నిధులు ఇస్తామని ఆశ చూపించింది. జూన్ నెలలో తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయం. చట్టం ఒప్పుకోం..24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడమే తమ విధానం..ప్రధాన మంత్రికి స్వయంగా సీఎం కేసీఆర్ లేఖ రాసింది వాస్తవం కాదా ? అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాం. బిల్లును వ్యతిరేకిస్తున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు.

ఝుటా నెంబర్ 8 : తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యాన్ని మొత్తం మేమే కొంటున్నాం..రూ. 5 వేల 500 కోట్లు విడుదల చేసినం అంటున్నారు. ఇంత పచ్చి అబద్ధం మాట్లాడుతారా ? ఒక్క రూపాయి ఇవ్వలేదు. సివిల్ సప్లయి కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీతో బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకుని రైతులకు వడ్లు కొని మూడు రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు ఇస్తుంది టీఆర్ఎస్ ప్రభుత్వం.

ఝుటా నెంబర్ 9 : సిద్ధిపేటలో పోలీసు అధికారులు సెర్చ్ చేస్తే ..ఆ ఇళ్లు కాదని అన్నారు. ఎందుకు ఉలిక్కి పడ్డారు ? ఎన్నికల ప్రచారం మానేసి ఎందుకు ధర్నా చేసినారు ? సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థి కుటుంబసభ్యుల మీద 8 ఇళ్ల మీద పోలీసులు సెర్చ్ చేసి వేధిస్తున్నారంటూ..సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. వాస్తవానికి రెండు టీఆర్ఎస్ నాయకుల ఇళ్లపై, రెండు బీజేపీ నాయకుల ఇళ్లపై దాడి జరిగింది. రెండు చోట్ల జరిగితే..8 చోట్ల దాడి జరిగిందని తప్పుడు ప్రచారం చేశారు.



ఝుటా నెంబర్ 10 : డబ్బులు దొరికినయి…పోలీసులే ఇరికించే ప్రయత్నం
చేస్తున్నారంటూ..ప్రచారం చేశారు. తెల్లారి మొత్తం బయటపడింది కదా. అత్తా, మామలే ఏం చెప్పారు ? స్వయంగా డబ్బులు కవర్ లో పెట్టడం, ఇతరత్రా సోదాలకు సంబంధించి వీడియోలు రిలీజ్ చేశారు కదా. మొహం ఎక్కడ పెట్టుకోవాలో తెలియని పరిస్థితి బీజేపీ నేతలకు ఉంది. ఇలా ఎన్నో ఉన్నాయి.
పచ్చి అబద్దాలతో ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

ఝుటా నాయకుల మాటలు వింటే..మోస పోతాం..గోస పడుతాం..తస్మాత్ జాగ్రత్త దుబ్బాక ప్రజలకు సూచిస్తున్నా’ అంటూ మంత్రి హరీష్ రావు సూచించారు.