TS Budget 2022-23 : సొంత స్థలం ఉన్నవారికి ఇల్లు కట్టుకోవటానికి రూ.3 లక్షలు : మంత్రి హరీశ్ రావు

సొంత స్థలం ఉన్నవారికి ఇల్లు కట్టుకోవటానికి రూ.3 లక్షలు ఇస్తుందని మంత్రి హరీశ్ రావు బడ్జెట్ సమావేశాల్లో తెలిపారు.

TS Budget 2022-23 : సొంత స్థలం ఉన్నవారికి ఇల్లు కట్టుకోవటానికి రూ.3 లక్షలు : మంత్రి హరీశ్ రావు

Ts Budget 2022 23

TS Budget 2022-23 : 2022-23 వార్షిక బడ్జెట్‌ను శాస‌న‌స‌భ‌లో ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావు ప్ర‌వేశ‌పెట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ సాధించాక ప్రజలకు టీఆర్ఎస్ ప్రభుత్వం పారదర్శక పాలన అందిస్తోందని తెలిపిన మంత్రి తెలంగాణ ప్రజల సొంత ఇంటిక కలను టీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేరుస్తోందని దాంట్లో భాగంగా ప్రజలకు ఇచ్చే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం ప్రభుత్వం రూ.12వేల కోట్లు కేటాయించామని తెలిపారు.

అలాగే సొంతంగా స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలనుకునేవారి కల నెరవేర్చటానికి ప్రభుత్వం రూ.3 లక్షలు ఇస్తోందని తెలిపారు. మొత్తం రూ. 2,56,958.51 కోట్ల‌తో హ‌రీశ్‌రావు బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెటట్టిన మంత్రి రెవెన్యూ వ్య‌యం రూ. 1.89 ల‌క్ష‌ల కోట్లు కాగా, క్యాపిట‌ల్ వ్య‌యం రూ. 29,728 కోట్లు. రాష్ట్రం ఆవిర్భవించిన అన‌తికాలంలో అద్భుత ప్ర‌గ‌తి సాధించామ‌ని హ‌రీశ్‌రావు తెలిపారు. సీఎం ప్ర‌జ‌ల న‌మ్మ‌కాన్ని నిల‌బెడుతూ ప్ర‌గ‌తి ప‌థంలో రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నారు. ప‌రిపాల‌న‌లో రాజీలేని వైఖ‌రిని టీఆర్ఎస్ అవ‌లంభించింది. కరెంట్ కోత‌లు, ఆక‌లి చావులు ఇప్పుడు లేవు అని స్పష్టం చేశారు మంత్రి హరీశ్ రావు.

వచ్చే సంవత్సరానికి 2 లక్షల మందికి దళిత బంధు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. దళిత బంధుకు బడ్జెట్ లో రూ. 17 వేల 700 కోట్లు కేటాయిస్తున్నట్లు అసెంబ్లీలో వెల్లడించారు. ఈ ఏడాది 11 వేల 800 కుటుంబాలకు లబ్ది చేకూరిందని, ఈ సంవత్సరం ప్రతి నియోజకవర్గానికి 100 మంది చొప్పున ఎంపిక చేస్తామని వెల్లడించారు.