KTR Criticized PM Modi Speech : ప్రధాని స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంపై మంత్రి కేటీఆర్ విమర్శలు

భారత 75 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవ వేడుల సందర్భంగా ప్రధాని మోడీ చేసిన ప్రసంగంపై మంత్రి కేటీఆర్ విమర్శలు సంధించారు. ప్రధాని గతంలో ఇచ్చిన ఏ వాగ్ధాలను నెరవేర్చలేదని..కానీ కొత్తగా మరోకొన్ని నిదర్ధేశాలు చెబుతున్నారని..చెప్పినవి చేయకుండా మళ్లీ కొత్త లక్ష్యాలు గురించి చెబితే ప్రజలు ఎలా నమ్ముతారు? అంటూ ప్రశ్నించారు. 

KTR Criticized PM Modi Speech :  ప్రధాని స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంపై మంత్రి కేటీఆర్ విమర్శలు

Minister KTR criticizes PM Modi's 75th Independence Day speech

KTR criticized PM Modi speech : భారత 75 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవ వేడుల సందర్భంగా ప్రధాని మోడీ చేసిన ప్రసంగంపై మంత్రి కేటీఆర్ విమర్శలు సంధించారు. ప్రధాని గతంలో ఇచ్చిన ఏ వాగ్ధాలను నెరవేర్చలేదని..కానీ కొత్తగా మరోకొన్ని నిదర్ధేశాలు చెబుతున్నారని..చెప్పినవి చేయకుండా మళ్లీ కొత్త లక్ష్యాలు గురించి చెబితే ప్రజలు ఎలా నమ్ముతారు? అంటూ ప్రశ్నించారు. 2022 ఆగ‌స్టు 15 నాటికి భార‌త్ ఎన్నో ఘ‌న‌త‌లు సాధిస్తుంద‌ని గ‌తంలో చేసిన ప్ర‌సంగాల‌ను మంత్రి కేటీఆర్ త‌న ట్విట్ట‌ర్‌లో పోస్టు చేశారు. సోమ‌వారం (ఆగస్టు 15,2022) ఎర్ర‌కోట వేదిక‌గా 2047 కోసం ప్ర‌ధాని మోదీ త‌న ప్ర‌సంగంలో కొన్ని ల‌క్ష్యాల‌ను నిర్దేశించారు. రానున్న 25 ఏళ్ల‌లో ఆ లక్ష్యాలను అందుకోవాలి అంటూ పిలుపునిచ్చారు.

ప్రధాని ప్రసంగంపై విమర్శలు చేసిన మంత్రి కేటీఆర్ ప్రధాని నిర్ధేశించిన ఆ ల‌క్ష్యాలు గొప్ప‌గానే ఉన్నాయి..కానీ గతంలో ఇచ్చిన లక్ష్యాల మాట ఏంటీ అంటూ ప్రశ్నించారు. 2022 ఆగ‌స్టు 15 నాటికి చేరుకోవాల‌న్న ల‌క్ష్యాల గురించి ప్ర‌ధాని ప‌ట్టించుకోవ‌డంలేద‌ని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా విమ‌ర్శించారు. ప్ర‌ధాని గ‌తంలో చేసిన వాగ్ధానాల గురించి దేశ ప్ర‌జ‌లు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు కేటీఆర్.

క్యా హువా తేరా వాదా అన్న హ్యాష్‌ట్యాగ్‌తో మంత్రి కేటీఆర్ ఓ ఫోటోను పోస్ట్ చేస్తూ..మోడీ గ‌తంలో చేసిన ప్ర‌సంగాల‌ను పేర్కొంటూ..2022 నాటికి ప్ర‌తి పేద‌వాడికి ఇంటిని నిర్మించి ఇస్తామ‌న్నార‌ని..రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామ‌న్నార‌ని.. భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను 5 ట్రిలియ‌న్ల డాల‌ర్లుగా మారుస్తామ‌ని..ప్ర‌తి ఇంటికీ క‌రెంటు స‌ర‌ఫ‌రా చేస్తామ‌ని ప్ర‌ధాని మోదీ వాగ్దానం చేశార‌ని..కానీ వాటిలో ఏ ఒక్క హామీ కూడా నెర‌వేర్చ‌లేద‌ని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. మీ నిర్ధేశించిన ల‌క్ష్యాల‌ను మీరు గుర్తించ‌లేన‌ప్పుడు జ‌వాబుదారీత‌నం ఎక్క‌డ ఉంటుంది అంటూ మంత్రి కేటీఆర్ ప్ర‌శ్నించారు. మీ వైఫ‌ల్యాల‌ను మీరే గుర్తించ‌లేక‌పోతున్నారు అంటూ కేటీఆర్ తనదైన శైలిలో విమ‌ర్శలు సంధించారు.