Puvvada Ajay Kumar : సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టోతో కాంగ్రెస్ ఆరు గ్యారంటీల పని అయిపోయింది : మంత్రి పువ్వాడ

సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టోతో కాంగ్రెస్ ఆరు గ్యారంటీ లు పని అయిపోయిందని..కాంగ్రెస్ ధీమా...భీమా కల్పించ లేకపోయింది అంటూ ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వమే మా పథకాలను కాపీ కొట్టిందన్నారు.

Puvvada Ajay Kumar : సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టోతో కాంగ్రెస్ ఆరు గ్యారంటీల పని అయిపోయింది : మంత్రి పువ్వాడ

Minister Puvvada Ajay Kumar

Updated On : October 17, 2023 / 12:27 PM IST

Minister Puvvada Ajay Kumar criticizes Congress : మూడవ సారి కూడా బీఆర్ఎస్ పార్టీదే విజయం అంటూ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మం బీఆర్ఎస్ కార్యాలయంలో పువ్వాడ అజయ్ కుమార్ తో పాటు అభ్యర్థులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అజయ్ కుమార్ మాట్లాడుతు.. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పలు సంక్షేమ పథకాలు, నిధులు తీసుకొచ్చామని, పోడు భూములకు పట్టాలిచ్చామని ఈ సారి జిల్లా ప్రజలు ఆలోచించుకుని ఓటు వేయాలని సూచించారు. ప్రత్యర్థి పార్టీలు అభ్యర్థులు తేల్చుకోలేక పోతున్నారు అంటూ ఎద్దేవా చేశారు. కదనరంగంలో నూతన ఉత్సాహంతో బరిలోకి దిగాం.. గత ఎన్నికల ఫలితాలకు భిన్నంగా పది స్థానాలలో బీఆర్ఎస్ గెలుచుకుంటుందన్నారు.తమకు ప్రధాన ప్రత్యర్ధి కాంగ్రెస్సే అన్నారు.

సీఎం కేసీఆర్ ను రేవంత్ రెడ్డి కాపీ మ్యానిఫెస్టో అంటున్నారు.. కాపీ కొట్టింది మీరు అంటూ విమర్శించారు. మేం ఇస్తున్న రైతు బంధు పథకం మీదా..? అని ప్రశ్నించారు.కేంద్ర ప్రభుత్వమే మా పథకాలను కాపీ కొట్టిందన్నారు. ఆసరా ఫించన్ ను వేలల్లో తీసుకెళ్లింది కేసీఆర్ అన్నారు. సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టోతో కాంగ్రెస్ ఆరు గ్యారంటీ లు పని అయిపోయిందని..కాంగ్రెస్ ధీమా భీమా కల్పించ లేకపోయింది అంటూ ఎద్దేవా చేశారు. ఖమ్మంజిల్లా ప్రజలు ఆలోచించుకుని ఓటు వేయాలని సూచించారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు.

Harish Rao : నమ్మకానికి నిదర్శనం కేసీఆర్, నయవంచనకు నిదర్శనం కాంగ్రెస్- మంత్రి హరీశ్ రావు

ఈ మీడియా సమావేశంలో పాల్గొన్న నామా నాగేశ్వరరావు మాట్లాడుతు..ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేమని..మూడవ సారి కూడా బీఆర్ఎస్ అధికారంలోకి రావటం ఖాయం అంటూ ధీమా వ్యక్తంచేశారు.  బీఆర్ఎస్ అభ్యర్థిల్ని ప్రజలు ఆశీర్వాదించాలని కోరారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టో ప్రజా అమోదయోగమైందని..రైతు బంధు, ఆరోగ్య భీమా, ఆసరా ఫించన్, గ్యాస్ సిలెండరు వంటివి ప్రజలకు ఉపయోగకరంగా ఉంటాయన్నారు. గత పదేళ్ళలో హామీలను అమలు చేసి చూపించామన్నారు. ఎన్నికలు అంటే ఎంతో మంది వస్తారు…60 ఏళ్లు పాలించిన వారు ఆరు గ్యారంటీలు అంటున్నారు వారి మాటల్ని ప్రజలు నమ్మరన్నారు. కాగా..ఖమ్మం బీఆర్ఎస్ కార్యాలయంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో పాటు అభ్యర్థులు, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, ఎంఎల్ సి తాతా మధుసూదన్ పాల్గొన్నారు.