MLA Raja Singh : రాజాసింగ్‎ను బీజేపీ సస్పెండ్ చేసిందా..? లేక పార్టీలోనే ఉన్నారా? కలకలం రేపిన ఫ్లెక్సీలు

హైదరాబాద్ లో వెలిసిన బీజేపీ ఫ్లెక్సీలు చర్చకు దారితీశాయి. ఫ్లెక్సీల్లో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫొటోలు కనిపించడం హాట్ టాపిక్ గా మారింది.

MLA Raja Singh : రాజాసింగ్‎ను బీజేపీ సస్పెండ్ చేసిందా..? లేక పార్టీలోనే ఉన్నారా? కలకలం రేపిన ఫ్లెక్సీలు

MLA Raja Singh : హైదరాబాద్ లో వెలిసిన బీజేపీ ఫ్లెక్సీలు చర్చకు దారితీశాయి. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పాదయాత్రతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బీజేపీ ఫ్లెక్సీలు భారీగా వెలిశాయి. బండి సంజయ్ సభ జరిగిన ప్రధాన వేదిక మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫొటోలు కనిపించాయి.

బీజేపీకి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారని, మూడు ఆర్ లు ఉంటేనే కేసీఆర్ కు నిద్ర పట్టడం లేదని, ఇక నాలుగో ఆర్ కూడా కలవబోతోంది అంటూ బండి సంజయ్ కామెంట్స్ చేశారు. అయితే, వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ గత నెలలోనే రాజాసింగ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది బీజేపీ. ఇప్పుడు బీజేపీ ఫ్లెక్సీలలో రాజాసింగ్ ఫొటో కనిపించడం చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ రాజాసింగ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారా? లేక ఆయన పార్టీలోనే ఉన్నారా? అనే చర్చ జరుగుతోంది.