Mahati Music Academy: ‘నాదం నాట్యం’ పేరుతో.. మహతి మ్యూజిక్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ప్రారంభం

మహతి మ్యూజిక్ అకాడమీ ఆధ్వర్యంలో ‘నాదం నాట్యం’ పేరుతో యూట్యూబ్ ఛానల్, అల్వా‌ర్ వైభవం పేరుతో ఆల్బమ్‌ను విడుదల చేశారు.

Mahati Music Academy: ‘నాదం నాట్యం’ పేరుతో.. మహతి మ్యూజిక్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ప్రారంభం

Mahati Music Academy

Updated On : April 30, 2023 / 12:41 PM IST

Mahati Music Academy: మహతి మ్యూజిక్ అకాడమీ ఆధ్వర్యంలో ‘నాదం నాట్యం’ పేరుతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభమైంది. అదేవిధంగా  ఆల్వార్ వైభవం పేరుతో ఆల్బమ్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా డాక్టర్ సముద్రాల రంగరామానుజ, మైహోం గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు, ఐ ల్యాబ్స్ గ్రూప్ చైర్మన్ సి. శ్రీనిరాజు తోపాటు పలువురు ప్రముఖులు పాల్గొని నాదం నాట్యం యూట్యూబ్ ఛానెల్, అల్వార్ వైభవం ఆల్బమ్‌ను ప్రారంభించారు.

 

ఈ సందర్భంగా రామేశ్వరరావు మాట్లాడుతూ.. ఈ చక్కటి కార్యక్రమానికి నన్ను పిలవడం ఆనందంగా ఉందని అన్నారు. మన వృత్తి వేరు, ప్రవృత్తి వేరు. గత 30 సంవత్సరాల నుంచి శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామివారి వద్ద శిష్యరికం అదృష్టం దొరకడం జరిగిందని, ఈ క్రమంలో ఆల్వార్‌ల విశిష్ఠత అన్ని విధాలుగా నేను అనుభవించడం జరిగిందన్నారు. ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని ఉషాకాంత్ గారు వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నా మనస్సుకు నచ్చిన ఈ ప్రవృత్తిని వదులుకోకుండా మహతి మ్యూజిక్ అకాడమీ స్థాపించి, ఈ రంగంలో అభిరుచి ఉండేవారికి చక్కటి పాటగా, సంగీతంగా అందించడం చాలా ఆనందదాయకం అని, వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు తెలిపారు. చిన్న జీయర్ స్వామివారి ఆశీస్సులు వారికి, వారి కుటుంబానికి ఉంటూ, ఈ పరపర కొనసాగాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు.