Ande Sri : అందెశ్రీ కుటుంబంలో ఒకరికి ప్రభుత్య ఉద్యోగం: సీఎం రేవంత్ రెడ్డి

Ande Sri : ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ అంత్యక్రియలు ఘట్కేసర్‌లోని ఎన్ఎప్‌సీ నగర్‌లో పోలీస్ లాంఛనాలతో ముగిశాయి.

Ande Sri : అందెశ్రీ కుటుంబంలో ఒకరికి ప్రభుత్య ఉద్యోగం: సీఎం రేవంత్ రెడ్డి

Andesri

Updated On : November 11, 2025 / 2:20 PM IST

Ande Sri : ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ అంత్యక్రియలు ఘట్కేసర్‌లోని ఎన్ఎప్‌సీ నగర్‌లో పోలీస్ లాంఛనాలతో ముగిశాయి. కడసారి వీడ్కోలు పలికేందుకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

అందెశ్రీ అంత్యక్రియల్లో సీఎం రేవంత్ రెడ్డితోపాటు పలువురు మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు, కవులు, కళాకారులతోపాటు ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అందెశ్రీ పాడె మోశారు. అంతకుముందు అందెశ్రీ కుటుంబ సభ్యులను పరామర్శించి వారిని ఓదార్చారు.

సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అందెశ్రీని కోల్పోవడం తెలంగాణ సమాజంతోపాటు నాకు, నాకుటుంబానికి బాధాకరమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందెశ్రీని గౌరవించడంతోపాటు.. అందెశ్రీకి పద్మశ్రీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రాతిపాదిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. అందెశ్రీకి పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని గత సంవత్సరం కేంద్రానికి లేఖ రాయడం జరిగిందని, ఈ సంవత్సరంకూడా స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీని కలిసి అందెశ్రీకి పద్మశ్రీ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తామని అన్నారు. అందెశ్రీ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని తెలిపారు. పాఠ్యాంశంగా జయ జయహే తెలంగాణ గీతంను పొందుపరుస్తామని, ప్రతి లైబ్రరీలో నిప్పుల వాగు గ్రంథంను అందుబాటులో ఉంచుతామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అందెశ్రీ స్మృతి వనం ఏర్పాటు చేస్తామని అన్నారు.