బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నేత బాబా ఫసియుద్దీన్ దాడి.. బ్రదర్స్ అంటూ పోలీసులపై ఫైర్ అయిన సునీత
జూబ్లీ హిల్స్ బోరబండ్ పోలింగ్ బూత్‌లో ఉద్రిక్తత: కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఘర్షణ!
జూబ్లీ హిల్స్ బోరబండ్ పోలింగ్ బూత్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలింగ్ ఏజెంట్లు టేబుల్స్ పెట్టుకోకుండా కాంగ్రెస్ నాయకుడు బాబా ఫసీయుద్దీన్ అడ్డుకొని దౌర్జన్యం చేశారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.
ఈ ఘటనపై బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తీవ్రంగా స్పందించారు. అధికార పార్టీకి పోలీసులు అండగా నిలుస్తున్నారని ఆమె ఆరోపించారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేసి బెదిరించిన ఘటనలో పోలీసులు తప్పుగా వ్యవహరించారని సునీత హెచ్చరించారు.
