Bathukamma: తొమ్మిది రోజులూ.. తొమ్మిది తీర్లు.. ఇదీ బతుకమ్మ సాగే విధానం

తెలంగాణకే ప్రత్యేకం ‘బతుకమ్మ’ వేడుకలు. దశాబ్దాల నుంచి తెలంగాణ సంస్కృతిలో భాగంగా ఈ వేడుకలు కొనసాగుతున్నాయి. ఈ నెల 25 నుంచి బతుకమ్మ సంబరాలు ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకలు రోజూ ఒకేలా ఉండవు. తొమ్మిది రోజులు.. తొమ్మిది తీర్లుగా ఈ వేడుకలు సాగుతాయి.

Bathukamma: తొమ్మిది రోజులూ.. తొమ్మిది తీర్లు.. ఇదీ బతుకమ్మ సాగే విధానం

Bathukamma: తెలంగాణలో బతుకమ్మ వేడుకలు తొమ్మిది రోజులు వైభవంగా జరుగుతాయి. అలాగని తొమ్మిది రోజులూ ఒకేలా జరగవు. తొమ్మిది రోజులూ తొమ్మిది తీర్లుగా బతుకమ్మ వేడుకలు జరుగుతాయి. బతుకమ్మ వేడుకల్లో ఏరోజుకారోజే ప్రత్యేకం. రోజుకో విశిష్టత ఉంటుంది.

Doctor Revives Newborn Baby: ఊపిరి ఊది చిన్నారి ప్రాణం నిలబెట్టిన డాక్టర్.. వీడియో వైరల్

మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మ, రెండో రోజు అటుకుల బతుకమ్మ, మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగో రోజు నానే బియ్యం బతుకమ్మ, ఐదోరోజు అట్ల బతుకమ్మ, ఆరో రోజు అలిగిన బతుకమ్మ, ఏడోరోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మ, తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ నిర్వహిస్తారు. ఇవి కూడా చాలా సంప్రదాయబద్దంగా జరుగుతాయి. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ. అంటే ఈ రోజుకంటే ఒక రోజు ముందుగానే బతుకమ్మను అలంకరించడానికి పూలు కోస్తారు. అవి మరుసటి రోజుకు వాడిపోకుండా నీళ్లలో వేసి, తర్వాతి రోజు బతుకమ్మగా పేరుస్తారు.

Gujarat: జైలు అధికారులు టిఫిన్ పెట్టడం లేదని ఒకేసారి ఏడుగురు ఖైదీల ఆత్మహత్యాయత్నం

అందుకే ఈ బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మ అంటారు. ఈ రోజు మహిళలు తమలపాకులు, తులసి ఆకులను వాయనంగా ఇస్తారు. రెండోరోజు తంగేడు పూలు, గునుగు పూలు, బంతి పూలు, గడ్డి పూలను సేకరించి, గౌరమ్మను పేరుస్తారు. సాయంత్రం పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ అక్కడే నిమజ్జనం చేస్తారు. ఆ రోజు ప్రసాదంగా అటుకులు పంచుతారు. ఇక మూడోరోజు సీతమ్మ జడ, చామంతి, రామ బాణం వంటి పూలతో బతుకమ్మను పేర్చి, ముద్దపప్పు బతుకమ్మగా పూజిస్తారు. ఈ రోజు బెల్లం, సత్తుపిండి, చక్కెర, పెసలు వాయనంగా ఇస్తారు. నాలుగోరోజు నానబియ్యం బతుకమ్మ నిర్వహిస్తారు. ఈ రోజు గుమ్మడి, మందార పూలతో బతుకమ్మను పేరుస్తారు.

Kerala Shocker: మద్యం కొనేందుకు డబ్బులు ఇవ్వలేదని తల్లిపై కిరోసిన్ పోసి కాల్చిన కొడుకు

తర్వాత నానబెట్టిన బియ్యం, బెల్లంతో కలిపి వాయనంగా ఇస్తారు. ఇక ఐదో రోజు అట్ల బతుకమ్మ నిర్వహిస్తారు. ఆరో రోజు అలిగిన బతుకమ్మ, ఏడో రోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మగా పూజిస్తారు. చివరగా తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ నిర్వహిస్తారు. బతుకమ్మ వేడుకల్లో ఈ రోజు చాలా ప్రత్యేకమైంది. ఆడపడుచులంతా బతుకమ్మలు పేర్చి, వాటి చుట్టూ చేరి చప్పట్లు, కోలలతో, పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ బతుకమ్మను ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేస్తారు. ఈ రోజుతో బతుకమ్మ వేడుకలు ముగుస్తాయి.