Bandi Sanjay: బండి సంజయ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

నిర్మల్ జిల్లా భైంసాకు బండి సంజయ్ వెళ్తుండగా జగిత్యాల మండలం తాటిపల్లి వద్ద ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. నిర్మల్ జిల్లాలో ఆయన చేపట్టాల్సిన పాదయాత్రకు అనుమతి లేదని చెప్పారు. దీంతో ఆయన ఓ బీజేపీ కార్యకర్త వాహనంలో పోలీసులను తప్పించుకుని వెళ్లారు. బండి సంజయ్ ను కోరుట్ల మండలం వెంకటాపురం వద్ద పోలీసులు మళ్ళీ అడ్డుకున్నారు. దీంతో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. తన పాదయాత్రకు ఎందుకు అనుమతి ఇవ్వబోరని బండి సంజయ్ ప్రశ్నించారు. బీజేపీ కార్యకర్తలో కలిసి ధర్నాకు దిగారు. దీంతో బండి సంజయ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయనను జగిత్యాల వైపునకు తరలిస్తున్నారు.

Bandi Sanjay: బండి సంజయ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

Bandi Sanjay

Bandi Sanjay: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ను జగిత్యాల జిల్లాలో పోలీసులు రెండుసార్లు అడ్డుకున్నారు. చివరకు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. బండి సంజయ్ చేపట్టాల్సిన పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే. రేపటి నుంచి ఆయన ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టాలనుకున్నారు. అందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో నిర్మల్ జిల్లా భైంసాకు బండి సంజయ్ వెళ్తుండగా జగిత్యాల మండలం తాటిపల్లి వద్ద ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. నిర్మల్ జిల్లాలో ఆయన చేపట్టాల్సిన పాదయాత్రకు అనుమతి లేదని చెప్పారు. దీంతో ఆయన ఓ బీజేపీ కార్యకర్త వాహనంలో పోలీసులను తప్పించుకుని వెళ్లారు. బండి సంజయ్ ను కోరుట్ల మండలం వెంకటాపురం వద్ద పోలీసులు మళ్ళీ అడ్డుకున్నారు. దీంతో మరోసారి ఉద్రిక్తత నెలకొంది.

తన పాదయాత్రకు ఎందుకు అనుమతి ఇవ్వబోరని బండి సంజయ్ ప్రశ్నించారు. బీజేపీ కార్యకర్తలో కలిసి ధర్నాకు దిగారు. దీంతో బండి సంజయ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయనను జగిత్యాల వైపునకు తరలిస్తున్నారు. పోలీసులు తమ పట్ల వ్యవహరిస్తున్న తీరు బాగోలేదని బీజేపీ కార్యకర్తలు మండిపడ్డారు. తాను పాదయాత్ర చేసి తీరతానని బండి సంజయ్ 10టీవీతో అన్నారు. ఉద్దేశపూర్వకంగానే తనను అడ్డుకుంటున్నారని చెప్పారు. గతంలో హైదరాబాద్ లోని భాగ్యలక్ష్మీ ఆలయం వద్ద కూడా ఇలాగే వ్యవహరించారని అన్నారు. తన పర్యటనతో అక్కడ గొడవలేమీ జరగలేదని చెప్పారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..