Pudding and Mink Pub: పబ్ లో డ్రగ్స్ కేసు విచారణలో విస్తుపోయే విషయాలు: డ్రగ్స్ కోసం ఏకంగా “స్మార్ట్ యాప్”

పబ్ కి వచ్చే కస్టమర్లకు రహస్యంగా డ్రగ్స్ సరఫరా చేసేందుకు గానూ ఏకంగా ఒక స్మార్ట్ యాప్ నే నిర్వాహకులు రూపొందించినట్లు పోలీసులు గుర్తించారు.

Pudding and Mink Pub: పబ్ లో డ్రగ్స్ కేసు విచారణలో విస్తుపోయే విషయాలు: డ్రగ్స్ కోసం ఏకంగా “స్మార్ట్ యాప్”

Pub

Pudding and Mink Pub: హైదరాబాద్ బంజారాహిల్స్ లోని హోటల్ రాడిసన్ బ్లు లో ఉన్న పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ లో..రెడ్ హ్యాండెడ్ గా డ్రగ్స్ పట్టుబడడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలన కలిగించిన విషయం తెలిసిందే. ఈఘటనలో పబ్ నిర్వాహకులు, యాజమాన్యం సహా..డ్రగ్స్ సరఫరాధారులను అదుపులోకి తీసుకున్న బంజారాహిల్స్ పోలీసులు విచారణ చేపడుతున్నారు. పబ్ మేనేజర్ అనిల్ కుమార్ మరియు నిర్వాహకుడు అభిషేక్ లను పోలీసులు ఆదివారం రాత్రి మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచారు. కోర్ట్ వీరికి 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే ఆదివారం రాత్రి రిమాండ్ ఆలస్యం కావడంతో అనిల్ అభిషేక్ లను బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కి తరలించారు పోలీసులు. తిరిగి సోమవారం వీరిని రిమాండ్ కు తరలించారు. పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ కేసులో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న అర్జున్ వీరమాచినేని కోసం రెండు పోలీసు బృందాలు గాలిస్తుండగా..మొత్తం నాలుగు పోలీసు బృందాలు కేసు దర్యాప్తులో పాల్గొన్నాయి.

Also read:Kallapu Kushitha : లేట్ హవెర్స్ పబ్‌లో ఉండటం మా తప్పు కాదు.. దయచేసి మమ్మల్ని బద్నాం చేయకండి..

ఇదిలాఉంటే పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ లో డ్రగ్స్ కేసు విచారణ చేస్తున్న పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలిసాయి. గతంలో ఈ పబ్ లో జరిగిన కొన్ని పుట్టినరోజు వేడుకలకు సైతం నిర్వాహకులు డ్రగ్స్ సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు. పబ్ వైపు పోలీసుల తనిఖీలు ఉండవు, 24 గంటలూ మద్యం అందుబాటులో ఉంటుంది, డ్రగ్స్ కూడా సరఫరా చేస్తామంటూ పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ నిర్వాహకులు హై ప్రొఫైల్ కస్టమర్లను ఆకర్షించినట్లు పోలీసు విచారణలో తేలింది. అంతేకాదు..పబ్ కి వచ్చే కస్టమర్లకు రహస్యంగా డ్రగ్స్ సరఫరా చేసేందుకు గానూ ఏకంగా ఒక స్మార్ట్ యాప్ నే నిర్వాహకులు రూపొందించినట్లు పోలీసులు గుర్తించారు. పామ్ యాప్ లో రిజిస్ట్రేషన్ చేసుకొని OTP వచ్చిన వారికి మాత్రమే పబ్ లోకి అనుమతి ఇస్తున్నారు.

Also read:BiggBoss Non Stop : ఈ వారం బిగ్‌బాస్‌ నుంచి తేజస్విని అవుట్

డ్రగ్స్ కోసం మరో యాప్ తో పాటు ప్రత్యేక వాట్సప్ గ్రూప్ పెట్టినట్లు గుర్తించిన పోలీసులు.. ఈ మొత్తం వ్యవహారం పబ్ మేనేజర్ అనిల్ కుమార్ కనుసన్నుల్లో నడుస్తున్నట్లు తేల్చారు. డ్రగ్స్ కోసం యాప్ ద్వారా ముందుగా సమాచారం అందిస్తే..డబ్బు చెల్లింపు అనంతరం ఫోన్ కు వచ్చిన ఓటీపీని నిర్ధారించుకున్న తరువాత నిర్వాహకులు డ్రగ్స్ ను అందజేసినట్లు పోలీసు విచారణలో తేలింది. డ్రగ్స్ దందాపై పరారీలో ఉన్న అర్జున్ వీరమాచినేని కోసం రెండు బృందాలుగా గాలిస్తున్నామని..కేసులో పట్టుబడిన మరికొందరికి సోమవారం నోటీసులు ఇస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

Also read:telangana congress: రాహుల్ గాంధీతో సాయంత్రం రాష్ట్ర కాంగ్రెస్ నేతల భేటీ.. నేతల మధ్య విబేధాలకు చెక్ పడేనా?