Kallapu Kushitha : లేట్ హవెర్స్ పబ్‌లో ఉండటం మా తప్పు కాదు.. దయచేసి మమ్మల్ని బద్నాం చేయకండి..

తాజాగా ఓ షార్ట్ ఫిలిం నటి, ఆర్టిస్ట్ కల్లపు కుషితా కూడా ఇందులో ఉండటంతో ఆమె కూడా స్పందించింది. ఓ సెల్ఫీ బైట్ ని మీడియాకి రిలీజ్ చేసింది కల్లపు కుషితా. ఈ వీడియోలో తాను.......

Kallapu Kushitha : లేట్ హవెర్స్ పబ్‌లో ఉండటం మా తప్పు కాదు.. దయచేసి మమ్మల్ని బద్నాం చేయకండి..

Kushitha

 

Kallapu Kushitha :  సమయం దాటిన తర్వాత కూడా పబ్ నిర్వహిస్తున్నారనే సమాచారంతో బంజారాహిల్స్ రాడిసన్‌ బ్లూ హోటల్‌లో నిర్వహిస్తున్న ఫుడింగ్‌ మింగ్‌ పబ్‌పై పోలీసులు రైడ్‌ చేశారు. ఆ సమయంలో పోలీసులు వెళ్లేసరికి దాదాపు 150 మంది యువతీ యువకులు పార్టీలు చేసుకుంటున్నారు. అయితే అక్కడ డ్రగ్స్ కూడా బయటపడటంతో పబ్‌ నిర్వాహకులతో పాటు 150 మంది యువతీయువకులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దీంట్లో చాలా మంది ప్రముఖుల పిల్లలు కూడా ఉండటంతో ఈ వార్త సంచలనంగా మారింది. ఇప్పటికే ఈ కేసులో పేర్లు వినిపించిన సెలబ్రిటీలు, వారి కుటుంబ సభ్యులు కొంతమంది దీనిపై స్పందించారు.

తాజాగా ఓ షార్ట్ ఫిలిం నటి, ఆర్టిస్ట్ కల్లపు కుషితా కూడా ఇందులో ఉండటంతో ఆమె కూడా స్పందించింది. ఓ సెల్ఫీ బైట్ ని మీడియాకి రిలీజ్ చేసింది కల్లపు కుషితా. ఈ వీడియోలో తాను మాట్లాడుతూ.. ”లేట్ హవెర్స్ పబ్ లో ఉండటం మా తప్పు కాదు. అక్కడ డ్రగ్స్ వినియోగిస్తున్నారు అన్న విషయం మాకు తెలియదు. తెలిస్తే మేము అక్కడికి ఎందుకు వెళ్తాము. అక్కడ రష్ ఎక్కువగా ఉన్నమాట నిజమే. డ్రగ్స్ అక్కడ వినియోగిస్తున్నారని మాకు అసలు తెలీదు. మా ఫ్రెండ్స్ పార్టీ అయ్యాక బయటకి వెళదామని అనుకునే లోపే పోలీసులు వచ్చారు. అందరిని బాధ్యులను చేయడం, పోలీస్ స్టేషన్ తీసుకెళ్లడం సరికాదు.”

Rahul Sipligunj : నేను ఏ పరీక్షకైనా సిద్దమే.. రాడిసన్ ఘటనపై స్పందించిన రాహుల్ సిప్లిగంజ్..

”పోలీసులు వచ్చి మా డిటైల్స్ తీసుకున్నారు. మేము పోలీసులకు సహకరించాము. కావాలంటే మా బ్లడ్ శాంపిల్స్ తీసుకొని చెక్ చేసుకోండి, మేము రెడీనే. మీడియా వాళ్లు కొంచం సమన్వయం పాటించాలి. పబ్ కి వచ్చిన వాళ్ళని అందరిని బద్నామ్ చేయడం సరికాదు. మేము ఇప్పుడు ఇప్పుడే సినిమా రంగంలో ఎదుగుతున్నాం. మమ్మల్ని ఇలా తప్పుపట్టడం సరి కాదు. 150 మంది పబ్ లో ఉన్నారు. ఇలా ఉన్న వారందరిపై ద్రుష్పచారం చేయడం సరి కాదు.”

Nagababu : రాడిసన్ ఘటనపై స్పందించిన నాగబాబు

”అందరి రక్త నమూనాలు తీసుకొని చెక్ చేయండి. ఎవరు డ్రగ్స్ తీసుకున్నారో వారిపై చట్టరీత్య చర్యలు తీసుకోండి. దానికి మేము కూడా సహకరిస్తాం. ఇలాంటి దృష్ప్రచారం వల్ల మా కుటుంబసభ్యులు మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. ముందు పబ్ అర్ధరాత్రి వరకు నడిపించే వారిపై చర్యలు తీసుకోండి. మేము కేవలం పార్టీకి వెళ్ళాం. దయచేసి మీడియా వారు మమ్మల్ని బద్నాం చేయకండి” అని తెలిపింది.