Mahankali Bonalu : భాగ్యనగరం ఉమ్మడి దేవాలయాల మహంకాళి బోనాల జాతరపై సమీక్ష సమావేశం

ఈ నెల 17న సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి బోనాలు, 24, 25 తేదీల్లో లాల్ దర్వాజ బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని తెలిపారు. కో-ఆర్డినేటర్ మీటింగ్ ఏర్పాటు చేసి భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని పేర్కొన్నారు.

Mahankali Bonalu : భాగ్యనగరం ఉమ్మడి దేవాలయాల మహంకాళి బోనాల జాతరపై సమీక్ష సమావేశం

Bonalu (1)

Mahankali Bonalu : హైదరాబాద్ పాతబస్తీలో మిర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాలార్ జాంగ్ మ్యూజియంలో భాగ్యనగర ఉమ్మడి దేవాలయాల మహంకాళి బోనాల జాతరపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆయా దేవాలయాల కమిటీ చైర్మన్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ హైదరాబాద్ జంట నగరాల్లో బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు.

ఈ నెల 17న సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి బోనాలు, 24, 25 తేదీల్లో లాల్ దర్వాజ బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని తెలిపారు. కో-ఆర్డినేటర్ మీటింగ్ ఏర్పాటు చేసి భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని పేర్కొన్నారు. బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగాలని ముఖ్యమంత్రి కేసీఆర్ 15 కోట్ల రూపాయలు కేటాయించారని తెలిపారు.

Ashada Bonalu 2022 : ప్రారంభమైన ఆషాఢ బోనాలు

భాగ్యనగరంలో ఉన్న 3,500 ఆయా అమ్మవారి దేవాలయాలకు ఆర్ధిక సహాయం అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని కొనియాడారు. ఇంత పెద్ద సంఖ్యలో దేవాలయాలకు ఆర్ధిక సహాయం అందించిన ఘనత దేశంలో ముఖ్యమంత్రి కేసీఅర్ ఒక్కరికే దక్కుంతుందన్నారు. జీహెచ్ఎంసీ, ఆర్ అండ్ బి, మెడికల్, ట్రాఫిక్, పోలీస్, విద్యుత్ శాఖ, జలమండలి ఆయా శాఖల అధికారులతో కో-ఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేశామని చెప్పారు. ఘనంగా బోనాల ఉత్సవాలు నిర్వహించేందుకు ప్రభుత్వం అని ఏర్పాట్లు చేస్తోందన్నారు.