TSRTC: హైదరాబాద్ ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్ న్యూస్.. T-6, F-24 టికెట్లు తీసుకువచ్చిన ఆర్టీసీ

గ్రేటర్‌ హైదరాబాద్‌లో తీసుకువచ్చిన టి-24 టికెట్‌కు ప్రయాణికుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ పరిధిలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు 33.38 కోట్ల మంది ప్రయాణికులు టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. వారిలో 55.50 లక్షల మంది టీ-24 టికెట్లను కొనుగోలు చేశారు. ప్రస్తుతం ప్రతి రోజు సగటున 25 వేల వరకు ఆ టికెట్లు అమ్ముడవుతున్నాయి

TSRTC: హైదరాబాద్ ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్ న్యూస్.. T-6, F-24 టికెట్లు తీసుకువచ్చిన ఆర్టీసీ

RTC good news for Hyderabad passengers.. RTC brought T-6, F-24 tickets

TSRTC: గ్రేటర్‌ హైదరాబాద్‌లోని ప్రజలు, పర్యాటకులకు మరింత చేరువ అయ్యేందుకు రెండు స్పెషల్‌ ఆఫర్లను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) ప్రకటించింది. ప్రయాణికుల ఆర్థిక భారం తగ్గించేందుకు టి-24 టికెట్‌ను ఇప్పటికే అందజేస్తోన్న సంస్థ.. తాజాగా టి-6, ఫ్యామిలీ-24 పేరుతో కొత్త టికెట్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. హైదరాబాద్‌లోని బస్ భవన్‭లో గురువారం టి-6, ఫ్యామిలీ-24 టికెట్ల పోస్టర్లను టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ ఆవిష్కరించారు. ఈ టికెట్లు శుక్రవారం నుంచి బస్ కండక్టర్ల వద్ద అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు.

Job Vacancies In IDBI : ఐడిబిఐ బ్యాంక్ లో పలు ఉద్యగ ఖాళీల భర్తీకి ముగియ నున్న తుదిగడువు !

మహిళలు, సీనియర్‌ సిటిజన్ల సౌకర్యార్థం టి-6 టికెట్‌ను సంస్థ అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనిని రూ.50 చెల్లించి గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని సిటి ఆర్డినరీ, మెట్రో బస్సుల్లో ఆరు గంటల పాటు వారు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే టి-6 టికెట్‌ చెల్లుబాటు అవుతుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ టికెట్‌ను బస్సుల్లో కండక్టర్‌లు ఇస్తారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత టి-6 టికెట్లను మంజూరు చేయరు. 60 ఏళ్లు పైబడిన సీనియర్‌ సిటిజన్లకు టి-6 టికెట్‌ వర్తిస్తుంది. టికెట్‌ తీసుకునే సమయంలో వయసు ద్రువీకరణ కోసం వారు ఆధార్‌ కార్డు చూపించాల్సి ఉంటుంది.

వారంతాలు, సెలువు దినాల్లో కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి ప్రయాణించేందుకు వీలుగా ఫ్యామిలీ-24 టికెట్‌ను సంస్థ అందుబాటులోకి తెచ్చింది. ఈ టికెట్‌కు రూ.300 చెల్లిస్తే.. నలుగురు రోజంతా సిటీ ఆర్డినరీ, మెట్రో బస్సుల్లో ప్రయాణించవచ్చు. ఐదేళ్ల లోపు చిన్నారులకు ప్రయాణం ఉచితం కాగా.. అంతకు పైబడిన వారు ఫ్యామిలీ-24 టికెట్‌ తీసుకోవచ్చు. శని, ఆదివారాలతో పాటు సెలవు దినాల్లో మాత్రమే ఈ ఆఫర్‌ ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో తిరిగే బస్సుల్లో టి-24 టికెట్‌ను సంస్థ అందజేస్తోంది. 24 గంటల పాటు ఆ టికెట్‌ చెల్లుబాటు అవుతుంది. ఆ టికెట్‌ ధర పెద్దలకు రూ.100, పిల్లలకు రూ.60గా ఉంది.

Train Driver Viral Video: బాబోయ్.. రాత్రివేళ మంచులో రైలు స్పీడ్‌గా వెళ్తుంటే వీడియో చూశారా? ఎలాన్ మస్క్ ఎంట్రీతో వైరల్ ..

“గ్రేటర్‌ హైదరాబాద్‌లో తీసుకువచ్చిన టి-24 టికెట్‌కు ప్రయాణికుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ పరిధిలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు 33.38 కోట్ల మంది ప్రయాణికులు టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. వారిలో 55.50 లక్షల మంది టీ-24 టికెట్లను కొనుగోలు చేశారు. ప్రస్తుతం ప్రతి రోజు సగటున 25 వేల వరకు ఆ టికెట్లు అమ్ముడవుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ ప్రయాణికులకు, పర్యాటకులకు మరింత చేరువ అయ్యేందుకు టి-6, ఫ్యామిలీ-24 టికెట్లను టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. మహిళలు, సీనియర్‌ సిటిజన్స్‌, కుటుంబ సభ్యులు, స్నేహితులు ఈ టికెట్లను వినియోగించుకోవాలి. టి-24 టికెట్‌ అయితే.. నలుగురు రూ.400 చెల్లించాల్సి ఉంటుంది. ఫ్యామిలీ-24తో ముగ్గురికి రూ.300 చెల్లించి నలుగురు ప్రయాణం చేయవచ్చు” అని టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ తెలిపారు. టి-24 టికెట్‌ మాదిరిగానే వాటిని ఆదరించాలని ప్రజలను కోరారు. ప్రయాణికులకు ఆర్థిక భారాన్ని తగ్గించడం కోసమే టి-6, ఫ్యామిలీ-24 టికెట్లను అందుబాటులోకి తీసుకువచ్చామని స్పష్టం చేశారు. ఈ టికెట్ల ద్వారా తక్కువ చార్జీలతోనే హైదరాబాద్‌ నగరంలో ప్రయాణించవచ్చని గుర్తు చేశారు. టికెట్లకు సంబంధించిన పూర్తి వివరాలకు టీఎస్‌ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని సూచించారు.