Job Vacancies In IDBI : ఐడిబిఐ బ్యాంక్ లో పలు ఉద్యగ ఖాళీల భర్తీకి ముగియ నున్న తుదిగడువు !
ఎంపిక ప్రక్రియలో అభ్యర్థుల దరఖాస్తు ఫారమ్‌లో, సపోర్ట్‌గా అప్‌లోడ్ చేసిన పత్రాలలో పేర్కొన్న వయస్సు, విద్యార్హతలు, పని అనుభవం మొదలైన నిర్ణీత అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ప్రాథమిక స్క్రీనింగ్ కొనసాగుతుంది.

Job Vacancies In IDBI : ఐడిబిఐ బ్యాంక్ పలు ఉద్యగ ఖాళీల భర్తీ చేపట్టనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎస్ఓ, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న 114 కాగా వాటిలో మేనేజర్ 75 పోస్టులు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ 29 పోస్టులు ఉన్నాయి. ఆసక్తి , అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
ఐడిబిఐ స్పెషలిస్ట్ ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజర్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మార్చి 12, 2023 నిర్ణయించారు. జనరల్, EWS, OBC కేటగిరీలకు చెందిన అభ్యర్థులు రూ. 1000 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అయితే SC/ST కేటగిరీ అభ్యర్థులకు రూ. 200 ఫీజుగా నిర్ణయించారు.
ఎంపిక ప్రక్రియలో అభ్యర్థుల దరఖాస్తు ఫారమ్‌లో, సపోర్ట్‌గా అప్‌లోడ్ చేసిన పత్రాలలో పేర్కొన్న వయస్సు, విద్యార్హతలు, పని అనుభవం మొదలైన నిర్ణీత అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ప్రాథమిక స్క్రీనింగ్ కొనసాగుతుంది. ప్రిలిమినరీ స్క్రీనింగ్ తర్వాత, విద్యా అర్హతలు, పలు పత్రాల ధృవీకరణ ప్రకారం పోస్ట్‌లు/గ్రేడ్‌లకు అర్హతను నిర్ధారిస్తారు. అర్హతా ప్రమాణాలకు అనుగుణంగా అభ్యర్థుల ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు అభ్యర్థులు idbibank.in అధికారిక వెబ్‌సైట్ పరిశీలించగలరు.