Bhadrachalam: భద్రాచలంలో బూజుపట్టిన లడ్డూల విక్రయం.. అధికారులపై భక్తుల ఆగ్రహం

దాదాపు 50 వేల వరకు లడ్డూలు మిగిలిపోయాయి. దీంతో అవి బూజుపట్టాయి. వాటిని పక్కనపెట్టి, కొత్త లడ్డూలు విక్రయించాల్సిన ఆలయ అధికారులు కక్కుర్తి పడ్డారు. బూజుపట్టిన లడ్డూలనే భక్తులకు విక్రయించారు. దీంతో వాటిని కొనుగోలు చేసిన భక్తులు, ఆలయ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Bhadrachalam: భద్రాచలంలో బూజుపట్టిన లడ్డూల విక్రయం.. అధికారులపై భక్తుల ఆగ్రహం

Bhadrachalam: భద్రాచలంలోని రామయ్య ఆలయంలో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. రాముడి భక్తులకు అధికారులు బూజుపట్టిన లడ్డూలను విక్రయించారు. వీటిని కొనుగోలు చేసిన భక్తులు… తీరా అవి బూజు పట్టి ఉండటం చూసి షాకయ్యారు. ఇటీవల ముక్కోటి ఏకాదశి సందర్బంగా అధికారులు అదనంగా లడ్డూలు సిద్ధం చేశారు.

Vijaya Shanthi: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పుపై విజయశాంతి ట్వీట్.. క్లారిటీ వచ్చేసినట్లేనా?

అయితే, ఇవి పూర్తి స్థాయిలో విక్రయం కాలేదు. దాదాపు 50 వేల వరకు లడ్డూలు మిగిలిపోయాయి. దీంతో అవి బూజుపట్టాయి. వాటిని పక్కనపెట్టి, కొత్త లడ్డూలు విక్రయించాల్సిన ఆలయ అధికారులు కక్కుర్తి పడ్డారు. బూజుపట్టిన లడ్డూలనే భక్తులకు విక్రయించారు. దీంతో వాటిని కొనుగోలు చేసిన భక్తులు, ఆలయ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫంగస్ ఉన్న లడ్డూలు తిని, భక్తులకు ఫుడ్ పాయిజన్ అయితే, ఎవరిది బాధ్యత అంటూ ప్రశ్నిస్తున్నారు. భక్తులకు నాణ్యమైన లడ్డూలు అందించాల్సిన ఆలయ అధికారులు ఇలా కక్కుర్తితో, బూజు పట్టిన లడ్డూలను విక్రయిండచం ఏంటని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బూజు పట్టిన లడ్డూల విక్రయాన్ని నిలిపివేసి, నాణ్యమైన లడ్డూల్ని విక్రయించాలని, దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.