Jubilee Hills Gang Rape : జూబ్లీహిల్స్‌ గ్యాంగ్‌ రేప్‌ సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌..ఆ రోజు ఏం జరిగిందంటే?!

జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ నుంచి నిందితుల్ని ప్రత్యేక వాహనంలో బయటకు తీసుకొచ్చిన పోలీసులు.. అమ్నేసియా పబ్‌ మీదుగా పెద్దమ్మ గుడి దగ్గరకు తరలించారు. ఆ రోజు అక్కడ ఏం జరిగిందో తెలుసుకున్నారు.

Jubilee Hills Gang Rape : జూబ్లీహిల్స్‌ గ్యాంగ్‌ రేప్‌ సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌..ఆ రోజు ఏం జరిగిందంటే?!

Gang Rape

Jubilee Hills gang rape : హైదరాబాద్ జూబ్లీహిల్స్‌ గ్యాంగ్‌ రేప్‌ సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ ముగిసింది. పెద్దమ్మ గుడి వెనుక నిందితులతో పోలీసులు సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేయించారు. జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ నుంచి నిందితుల్ని ప్రత్యేక వాహనంలో బయటకు తీసుకొచ్చిన పోలీసులు.. అమ్నేసియా పబ్‌ మీదుగా పెద్దమ్మ గుడి దగ్గరకు తరలించారు. ఆ రోజు అక్కడ ఏం జరిగిందో తెలుసుకున్నారు. అనంతరం నిందితుల్ని అదే వాహనంలో పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

మరోవైపు జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తోంది. ఈ కేసులో బాధితురాలి మెడికల్ రిపోర్ట్ కీలకంగా మారింది. బాలిక శరీరంపై 12 గాయాలు ఉన్నట్లు వైద్యులు ఇచ్చిన రిపోర్టులో ఉంది. బాలిక మెడపై నిందితులు కొరికిన గుర్తులు ఉన్నాయి. మైనర్ బాలిక‌ మెడపై తీవ్రంగా కొరకడం, రక్కడంతో గాయాలు అయ్యాయి. బాలిక మెడపై టాటూలా ఉండాలనే, మెడపై కొరికినట్లు నిందితులు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పారు.

Jubilee Hills Rape Case : జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. ఒకరిపై మరొకరు చాడీలు చెప్పుకున్న మైనర్లు

ఇవాళ ఆరుగురు నిందితులను జూబ్లీ హిల్స్ పోలీసు స్టేషన్ లో ఏసీపీ సుదర్శన్ విచారిస్తున్నారు. సీన్ రీ కనస్ట్రక్షన్ కోసం పోలీసులు నిందితులను అమ్నేశియా పబ్ నుంచి రోడ్ నెంబరు 36 కు తీసుకువెళ్ళారు. ఈ కేసులో మరో సీసీటీవీ ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫుటేజిలో ఎరుపు రంగు బెంజి కారులో బాలిక బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 నుండి ప్రయాణిస్తన్న ఆధారాలు దొరికాయి. నిన్న ముగ్గురు మైనర్లతోపాటు ఒక మేజర్‌ను విచారణ అధికారి గంటపాటు ఇంటరాగేట్ చేశారు.

పబ్‌లో బాలికను పరిచయం చేసుకునప్పటి నుండి ట్రాప్‌లోకి దించడం…అనంతరం అత్యాచార ఘటన. మరుసటి రెండు రోజుల వరకు అసలు ఏం జరిగింది? ఎక్కడికి పరార్ అయ్యారు? ఎవరి సహాయంతో తెలంగాణ స్టేట్ దాటారు? ఇలా అనేక కోణాల్లో పోలీసు నిందితులను విచారించారు. సాదుద్దీన్ మాలిక్ కస్టడీ విచారణ నేటితో ముగియనుంది. పోలీసులు నిన్న ఆరుగురు నిందితులకు ఉస్మానియా ఆస్పత్రిలో పొటెన్సీ పరీక్షలు నిర్వహించారు.