Trains Restoration : నేటి నుంచి మరికొన్ని రైళ్లు తిరిగి ప్రారంభం

కరోనా లాక్‌డౌన్ కారణంగా పలు వ్యాపారాలు దెబ్బతిన్నాయి. అందులో రవాణా రంగం కూడా ఒకటి. కరోనా మహమ్మారి రైల్వేశాఖపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో గతేడాది నుంచి పెద్ద సంఖ్యలో రైలు సర్వీసులు నిలిచిపోయాయి.

Trains Restoration : నేటి నుంచి మరికొన్ని రైళ్లు తిరిగి ప్రారంభం

Scr Trains Restoration

Trains Restoration : కరోనా లాక్‌డౌన్ కారణంగా పలు వ్యాపారాలు దెబ్బతిన్నాయి. అందులో రవాణా రంగం కూడా ఒకటి. కరోనా మహమ్మారి రైల్వేశాఖపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో గతేడాది నుంచి పెద్ద సంఖ్యలో రైలు సర్వీసులు నిలిచిపోయాయి.

ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో రైల్వేశాఖ మళ్లీ సర్వీసులను తిరిగి మొదలు పెడుతోంది. తక్కువ ఆక్యుపెన్సీ కారణంగా రద్దు చేసిన పలు రైళ్లను పునరుద్ధరిస్తున్నట్లు భారతీయ రైల్వే పేర్కొంది. అందులో భాగంగా పలు రూట్లలో తాత్కాలికంగా రద్దు చేసిన ప్రత్యేక సర్వీసులను తిరిగి ప్రారంభించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

02603 చెన్నై సెంట్రల్‌ – హైదరాబాద్‌ ట్రైన్‌ను గురువారం నుంచి, 02604 హైదరాబాద్‌-చెన్నై సెంట్రల్‌ ట్రైన్‌ను ఈ నెల 18 నుంచి ప్రారంభిస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా.. కాచిగూడ – రేపల్లె డెల్టా ఎక్స్‌ప్రెస్, తుంగభద్ర ఎక్స్‌ప్రెస్‌, గుంటూరు-కాచిగూడ-గుంటూరు ఎక్స్‌ప్రెస్‌ను సైతం దక్షిణ మధ్య రైల్వే నిన్నటి నుంచి నడిపిస్తోంది.