Secunderabad Station Mastermind : సికింద్రాబాద్ విధ్వంసం.. సుబ్బారావుపై పోలీసుల ప్రశ్నల వర్షం

ఇప్పటికే సుబ్బారావుని అదుపులోకి తీసుకున్న నరసరావుపేట పోలీసులు.. అతడిని ప్రశ్నిస్తున్నారు. విచారణలో అతడిపై ప్రశ్నల వర్షం కురిపించారు. రైల్వేస్టేషన్లు ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారు? వ్యూహరచన ఎలా జరిగింది? దీని వెనుక ఇంకెవరున్నారు?(Secunderabad Station Mastermind)

Secunderabad Station Mastermind : సికింద్రాబాద్ విధ్వంసం.. సుబ్బారావుపై పోలీసుల ప్రశ్నల వర్షం

Secunderabad Station Mastermind

Secunderabad Station Mastermind : కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ స్కీమ్ ను వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో జరిగిన విధ్వంసం కేసులో పోలీసులు దర్యాఫ్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో దాడులకు ప్రధాన సూత్రధారిగా సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావుని అనుమానిస్తున్నారు పోలీసులు.

ఇప్పటికే సుబ్బారావుని అరెస్ట్ చేసిన నరసరావుపేట పోలీసులు.. అతడిని ప్రశ్నిస్తున్నారు. విచారణలో అతడిపై ప్రశ్నల వర్షం కురిపించారు. రైల్వేస్టేషన్లు ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారు? వ్యూహరచన ఎలా జరిగింది? దీని వెనుక ఇంకెవరున్నారు? అభ్యర్థులు కాకుండా బయటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? సమాచారం ఎలా షేర్ చేసుకున్నారు? అనే ప్రశ్నలకు పోలీసులు సుబ్బారావు నుంచి సమాధానాలు రాబడుతున్నట్లు సమాచారం.(Secunderabad Station Mastermind)

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

పల్నాడు జిల్లా నరసరావుపేటలోని సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ సుబ్బారావును విచారిస్తున్నామని నరసరావుపేట రూరల్ సీఐ భక్తవత్సల రెడ్డి తెలిపారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ విధ్వంసం ఘటనలో సుబ్బారావు పాత్ర ఉందని సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. దీంతో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సుబ్బారావు పాత్ర ఉందా లేదా అనేది విచారిస్తున్నామని ఆయన తెలిపారు. ఆందోళన జరిగిన సమయంలో తాను అక్కడలేనని సుబ్బారావు చెప్పాడని అన్నారు.

సుబ్బారావు విద్యార్థులకు వాట్సప్ మెసేజ్ లు పంపాడని, వాటి గురించి పరిశీలన చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు అకాడమీ ద్వారా రెండు వేల మంది అభ్యర్ధులకు ఉద్యోగాలు ఇప్పించానని సుబ్బారావు పోలీసులకు చెప్పినట్లు తెలిసింది.

Sai Defence Academy : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో విధ్వంసం.. పోలీసుల అదుపులో దాడుల సూత్రధారి?

సికింద్రాబాద్ విధ్వంసం ఘ‌ట‌న వెనుక ఏపీ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా న‌ర‌సరావుపేట‌కు చెందిన సాయి డిఫెన్స్ అకాడ‌మీ డైరెక్ట‌ర్ ఆవుల సుబ్బారావు ఉన్న‌ట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అల్లర్లకు అతడే సూత్రధారి అని పోలీసులు డౌట్ పడుతున్నారు. ఈ మేర‌కు సుబ్బారావుని తమ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సుబ్బారావు ఎవ‌రెవ‌రికి ఫోన్లు చేశాడు? ఎవరెవ‌రిని రెచ్చ‌గొట్టాడు? అనే దానిపై విచార‌ణ చేపట్టారు. ఆవుల సుబ్బారావును ఖ‌మ్మం జిల్లాలో అరెస్ట్ చేశారు. అక్క‌డి నుంచి పల్నాడు జిల్లా న‌ర‌స‌రావుపేట‌కు త‌ర‌లించారు.

Agnipath: ‘అగ్నిప‌థ్’ ఆందోళ‌న‌ల్లో పాల్గొన్న వారికి పోలీసు క్లియ‌రెన్స్ రాదు: ఎయిర్ చీఫ్ మార్ష‌ల్

ఇదిలా ఉండ‌గా సికింద్రాబాద్ అల్లర్ల కేసు విచారణలో షాకింగ్ అంశాలు బ‌య‌టప‌డ్డాయి. ప్రైవేట్ డిఫెన్స్ అకాడ‌మీల స‌హ‌కారంతోనే విద్యార్థులు విధ్వంసానికి పాల్ప‌డిన‌ట్లు పోలీసులు గుర్తించారు. విధ్వంస‌కారుల‌కు అకాడమీలలోనే ఆశ్రయం ఇచ్చినట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఆవుల సుబ్బారావు ఆధ్వ‌ర్యంలో నడుస్తున్న అకాడమీకి చెందిన విద్యార్థులు రైల్వే స్టేష‌న్ కి వ‌చ్చి విధ్వంసానికి పాల్పడినట్లు పోలీసులు తెలుసుకున్నారు. మొత్తంగా తెలంగాణ‌లో చోటు చేసుకున్న ఈ అల్ల‌ర్ల‌కు ఆంధ్రాలో మూలాలు ఉండ‌డం గ‌మ‌నార్హం.

భారత సాయుధ దళాల్లో నాలుగేళ్ల స్వల్పకాలిక ఉద్యోగ నియామకాల కోసం కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ విధానం అగ్గి రాజేసింది. తీవ్ర హింసకు దారితీసింది. దేశవ్యాప్తంగా ఆందోళనలు భగ్గుమంటున్నాయి. ఆర్మీ ఆశావహులు నిరసనలకు దిగుతూ పలు రైళ్లకు నిప్పంటించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోనూ ఆందోళనకారులు రైలును అగ్నికి ఆహుతి చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది.