Sai Defence Academy : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో విధ్వంసం.. పోలీసుల అదుపులో దాడుల సూత్రధారి?

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసం వెనుక భారీ కుట్ర కోణాన్ని వెలికితీసిన పోలీసులు హింసాత్మక ఘటనలకు కారణమైన వారిని అరెస్ట్ చేసే పనిలో ఉన్నారు.

Sai Defence Academy : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో విధ్వంసం.. పోలీసుల అదుపులో దాడుల సూత్రధారి?

Sai Defence Academy

Sai Defence Academy : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసం వెనుక భారీ కుట్ర కోణాన్ని వెలికితీసిన పోలీసులు హింసాత్మక ఘటనలకు కారణమైన వారిని అరెస్ట్ చేసే పనిలో ఉన్నారు. సాయి డిఫెన్స్ అకాడెమీ డైరెక్టర్ సుబ్బారావుని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు నరసరావుపేట పోలీసులు. ప్రకాశం జిల్లా కంభంలో సుబ్బారావుని అదుపులోకి తీసుకుని నరసరావు పేట టుటౌన్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. హింసాత్మక ఘటనలకు సంబంధించి సుబ్బారావుని భిన్న కోణాల్లో ప్రశ్నిస్తున్నారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

15ఏళ్ల క్రితం ఖమ్మం నుంచి నరసరావుపేటకు వలస వెళ్లారు సుబ్బారావు. ఖమ్మంలో ఆర్మీ అభ్యర్థులకు ట్రైనింగ్ ఇస్తారు. కానీ, ఆయన నరసరావుపేటలో నివాసం ఉంటున్నారు. ఖమ్మం, నరసరావుపేటతో పాటు హైదరాబాద్ లోనూ సాయి డిఫెన్స్ అకాడెమీలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఎక్కడ ఆర్మీ ర్యాలీ జరిగినా తన స్టూడెంట్స్ ను తీసుకెళ్లేవారు సుబ్బారావు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆర్మీ అభ్యర్థులు సృష్టించిన విధ్వంసం వెనుక వాట్సాప్ మేసేజ్ లు, గ్రూప్ చాటింగ్ లను గుర్తించారు పోలీసులు.

Harish Rao: ఆర్మీని ప్రైవేటు పరం చేసే కుట్ర: మంత్రి హరీష్ రావు

ఆర్మీ కోచింగ్ సెంటర్ల ఆధ్వర్యంలోనే దాడులకు ప్లాన్ జరిగినట్లు, నిరసనకారులకు హైదరాబాద్ లోని సాయి డిఫెన్స్ అకాడెమీ ఆశ్రయం ఇచ్చినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు పోలీసులు. రైల్వేస్టేషన్లకు చేరుకున్న అభ్యర్థులకు వాటర్ బాటిళ్లు, బటర్ మిల్క్, పులిహోర ప్యాకెట్లను డిఫెన్స్ ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు పంపిణీ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.

Agnipath: ‘అగ్నిప‌థ్’ ఆందోళ‌న‌ల్లో పాల్గొన్న వారికి పోలీసు క్లియ‌రెన్స్ రాదు: ఎయిర్ చీఫ్ మార్ష‌ల్

మొత్తం 10 డిఫెన్స్ అకాడెమీలకు చెందిన నిరసనకారులు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో జరిగిన హింసాత్మక ఘటనల్లో పాల్గొన్నట్టు పోలీసులు గుర్తించారు. మూడు రోజుల క్రితం ఆర్మీ పరీక్ష క్యాన్సిల్ అయినట్లు యూట్యూబ్ లో వీడియోలు పోస్ట్ చేయడంతో పాటు విద్యార్థులను రెచ్చగొట్టిన పలు అకాడెమీ డైరెక్టర్లను పోలీసులు గుర్తించారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటనపై దర్యాఫ్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఆందోళనల్లో పాల్గొన్న మొత్తం 122 మందిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ పోలీసుల అదుపులో 100 మంది నిరసనకారులు, రైల్వే పోలీసుల అదుపులో 22 మంది ఉన్నట్లు తెలుస్తోంది. అటు అల్లర్లకు కుట్ర రచించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నరసరావుపేటకు చెందిన సాయి డిఫెన్స్ అకాడెమీ డైరెక్టర్ సుబ్బారావుని సైతం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. విధ్వంసకర దాడులకు పాల్పడ్డ వారిలో సాయి డిఫెన్స్ అకాడెమీ అభ్యర్థులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హకీంపేట్ ఆర్మీ సోల్జర్స్ పేరుతో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి అల్లర్లకు ప్లాన్ చేసినట్లు తేల్చారు పోలీసులు.

ఇక కుట్రకు సూత్రధారులను గుర్తించేందుకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ రంగంలోకి దిగింది. వాట్సాప్ గ్రూప్ లో అభ్యర్థులను రెచ్చగొట్టిన వారిని పోలీసులు గుర్తించారు. వాట్సాప్ గ్రూప్స్, అలాగే సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా గుర్తింపు కొనసాగుతోంది. అటు నిరసనకారులపై 14 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు రైల్వే పోలీసులు. అల్లర్లకు ముందు రోజు గుంటూరు నుంచి హైదరాబాద్ కు 450 మంది సాయి డిఫెన్స్ అకాడెమీ అభ్యర్థులు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు.