Soyam Bapu Rao: అమాయక ఆదివాసీలను మత మార్పిడి చేయిస్తే…: తెలంగాణ ఎంపీ వార్నింగ్

"ఇప్పటికే మతం మారిన ఆదివాసీలు తిరిగి వస్తే డప్పులతో స్వాగతం పలుకుతాం.. లేదంటే మంచిగుండదు" అని సోయం బాపూరావు అన్నారు.

Soyam Bapu Rao: అమాయక ఆదివాసీలను మత మార్పిడి చేయిస్తే…: తెలంగాణ ఎంపీ వార్నింగ్

Soyam Bapurao

Soyam Bapu Rao – BJP: అమాయక ఆదివాసీలను మత మార్పిడి చేయిస్తే బుల్లెట్లు దింపుతామంటూ తెలంగాణ (Telangana ) ఎంపీ, బీజేపీ నేత సోయం బాపూరావు హెచ్చరించారు. ఆదిలాబాద్ (Adilabad) జిల్లా కేంద్రంలోని రాంలీలా మైదాన్ లో జన జాగృతి సురక్షా మంచ్ బహిరంగ సభ, ర్యాలీ నిర్వహించింది.

ఇందులో పెద్దఎత్తున పాల్గొన్నారు ఆదివాసీలు. సభకు సోయం బాపూరావ్, మహారాష్ట్ర ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. మతం మారిన ఎస్టీలకు రిజర్వేషన్లు, పథకాలు వర్తించకుండా చట్టం తేవాలని డిమాండ్ చేశారు. మతం మారిన ఎస్టీల వల్ల అర్హులైన వారికి అన్యాయం జరుగుతుందన్నారు.

ఈ సందర్భంగా సోయం బాపూరావు సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. “ఇప్పటికే మతం మారిన ఆదివాసీలు తిరిగి వస్తే డప్పులతో స్వాగతం పలుకుతాం.. లేదంటే మంచిగుండదు. జ్వరం వచ్చిందని వెళ్తే.. నీళ్లలో పారాసిటముల్ ట్యాబ్లట్ కలిపి ప్రభువు తగ్గించాడని మోసం చేస్తున్నారు. మతం మారిన ఆదివాసీలకు పథకాలు రిజర్వేషన్ అమలు చేయొద్దని పార్లమెంటులో పోరాటం చేస్తా.

కొంతమంది కావాలనే ఆదివాసీలను రావణాసురుని వారసులుగా చిత్రీకరిస్తున్నారు. ఆదివాసీలు రావణాసురుని వారసులైతే.. ఆయన మందిరాలు గూడంలలో ఎందుకు లేవు. ఆదివాసీలు రామ-హనుమాన్ భక్తులు. పోడుభూముల జోలికొస్తే పోలీసులు ఫారెస్ట్ అధికారులపై తిరిగి కేసులు పెట్టండి.. నేను అండగా ఉంటా” అని చెప్పారు.

Gaddar : ఆ పేరుతో తెలంగాణలో పెద్ద కుట్ర జరిగింది- గద్దర్ సంచలన వ్యాఖ్యలు