Bandi Sanjay On KCR BRS : రాజీనామా చేయాలి, బీఆర్ఎస్ తరపున పోటీ చేసి గెలవాలి-సీఎం కేసీఆర్‌కు బండి సవాల్

సీఎం కేసీఆర్ కు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ విసిరారు. రాజీనామా చేసి బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి గెలవాలన్నారు.

Bandi Sanjay On KCR BRS : రాజీనామా చేయాలి, బీఆర్ఎస్ తరపున పోటీ చేసి గెలవాలి-సీఎం కేసీఆర్‌కు బండి సవాల్

Bandi Sanjay On KCR BRS : సీఎం కేసీఆర్ కు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ విసిరారు. టీఆర్ఎస్ పేరుతో గెలిచి పార్టీ పేరుని ఎలా మారుస్తారని బండి సంజయ్ ప్రశ్నించారు. రాజీనామా చేసి బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి గెలవాలని సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ సవాల్ విసిరారు. బీఆర్ఎస్ కు జెండా, అజెండా లేదని విమర్శించారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ త‌న పార్టీ పేరును భార‌త్ రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్‌)గా మార్చ‌డంతో పాటుగా జాతీయ రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న‌ట్లుగా బుధ‌వారం ప్ర‌క‌ట‌న‌ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై బండి సంజయ్ స్పందించారు. కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. జాతీయ రాజ‌కీయాల్లోకి ఎవ‌రు వ‌చ్చినా తాము స్వాగ‌తిస్తామ‌ని ఆయ‌న చెప్పారు. అయితే భార‌త్ రాష్ట్ర స‌మితి అంటే అర్థ‌మేమిటో కేసీఆర్ చెప్పాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పార్టీని స్థాపించిన‌ప్పుడు నాడు పార్టీలో ఉన్న వాళ్ల‌లో ప్ర‌స్తుతం ఎంత‌మంది ఇంకా అదే పార్టీలో కొన‌సాగుతున్నారో చెప్పాల‌న్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఈ సంద‌ర్భంగా కేసీఆర్‌పై బండి సంజ‌య్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేశ రాజ‌కీయాల్లో విమానం కొన్న వాళ్లు ఇద్ద‌రే ఇద్ద‌రు ఉన్నార‌న్న సంజ‌య్‌… వారిలో ఒక‌రు కేఏ పాల్ కాగా, మ‌రొక‌రు కేసీఆర్ అని తెలిపారు. భ‌విష్య‌త్తులో విమానం కొన్న వీరిద్ద‌రూ పొత్తు పెట్టుకుంటారేమోన‌ని అన్నారు. బుధ‌వారం నాటి టీఆర్ఎస్‌ జ‌న‌ర‌ల్ బాడీ మీటింగ్‌లో ఏ ఒక్క‌రు కూడా సంతోషంగా కూర్చోలేద‌ని ఆయ‌న అన్నారు. కేసీఆర్ ఏ అజెండాతో జాతీయ పార్టీ పెట్టార‌ని సంజ‌య్‌ ప్ర‌శ్నించారు. త‌న కుమారుడు కేటీఆర్‌ను సీఎంని చేయాల‌న్న‌దే కేసీఆర్ ఆలోచ‌న అని చెప్పారు బండి సంజయ్.