Telangana : మన ఊరు-మన బడి, వనపర్తికి సీఎం కేసీఆర్..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వనపర్తి జిల్లాకు వెళ్లనున్నారు. మన ఊరు - మన బడి కార్యక్రమాన్ని మంగళవారం వనపర్తి జిల్లా నుంచి శ్రీకారం చుట్టనున్నారు.

Telangana : మన ఊరు-మన బడి, వనపర్తికి సీఎం కేసీఆర్..

Cm Kcr (5)

CM KCR Visit Wanaparthy : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వనపర్తి జిల్లాకు వెళ్లనున్నారు. మన ఊరు – మన బడి కార్యక్రమం ప్రభుత్వం నిర్వహించతలపెట్టిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్.. 2022, మార్చి 08వ తేదీ మంగళవారం వనపర్తి జిల్లా నుంచి శ్రీకారం చుట్టనున్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని జడ్పీ పాఠశాల మన ఊరు – మన బడి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఉమ్మడి పాలమూర జిల్లాలోనే మొట్టమొదటి నూతన కలెక్టరేట్ భవనాన్ని, టీఆర్ఎస్ పార్టీ కార్యలయాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం కర్నెతండా లిఫ్టు ఇరిగేషన్, మెడికల్ కళాశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు సీఎం కేసీఆర్. కార్యక్రమాల అనంతరం టీఆర్ఎస్ బహిరంగసభ నిర్వహించనుంది. సభలో సీఎం కేసీఆర్ ఏం మాట్లాడుతారోనన్న ఉత్కంఠ నెలకొంది. సీఎం పర్యటన సందర్భంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Read More : Hyderabad: ఎస్సార్ నగర్‌లో కారు బీభత్సం, 8నెలల పసికందుకు గాయాలు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంపై దూకుడు పెంచుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ నుంచే దేశవ్యాప్త ఉద్యమాలకు శ్రీకారం చుడుతున్నారు. కేంద్రంపై పోరాడేందుకు పలు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగడుతున్నారు సీఎం కేసీఆర్. కాంగ్రెస్, బీజేపీయేతర కూటమి ఏర్పాటుకు ప్రయత్నిస్తున్న కేసీఆర్..నేతలతో వరుసగా సమావేశమవుతున్నారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్ సీఎంతోనూ సంప్రదింపులు జరుపుతున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా కేసీఆర్‌కు ప్రజాదరణ పెరుగుతోంది. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌ ఠాక్రే, ఎన్సీపీ నేత శరద్ పవార్, జార్ఖండ్ సీఎం హేమంత్‌ సోరెన్‌ను కలిశారు. కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ చేసే పోరాటాలకు మద్దతివ్వాలని కోరారు సీఎం కేసీఆర్.