Telangana : కుటుంబాన్ని బహిష్కరించిన కుల పెద్దలు

తెలంగాణలోని జగిత్యాల జిల్లాలోని మోతే గ్రామంలో ఓ భూ పంచాయితీ వివాదంలో ఓ కుటుంబాన్ని కుల పెద్దలు గ్రామం నుంచి బహిష్కరించారు. దీంతో బాధిత కుటుంబం పోలీసులకు ఆశ్రయించారు. ఓ వివాదంలో కుల పెద్దలు తమ కుటుంబాన్ని గ్రామం నుంచి బహిష్కరించారని..మాకు న్యాయం చేయాలంటూ వేడుకున్నారు.

Telangana : కుటుంబాన్ని బహిష్కరించిన కుల పెద్దలు

Family Caste Boycott (2)

Family caste boycott : ఈ కంప్యూటర్ యుగంలో కూడా కులాలు మతాలు అంటూ పలు అరాచకాలు జరుగుతునే ఉన్నాయి. కులం పేరుతో దూషణలు..గ్రామ బహిష్కరణలు కొనసాగుతునే ఉన్నాయి. ఈక్రమంలో తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ఓ కుటుంబాన్ని గ్రామ పెద్దలు వెలివేశారు. గ్రామ బహిష్కరణ చేశారు. జిల్లాలోని మోతే గ్రామంలో ఓ భూ పంచాయితీ వివాదంలో ఓ కుటుంబాన్ని కుల పెద్దలు గ్రామం నుంచి బహిష్కరించారు. దీంతో బాధిత కుటుంబం పోలీసులకు ఆశ్రయించారు. ఓ వివాదంలో కుల పెద్దలు తమ కుటుంబాన్ని గ్రామం నుంచి బహిష్కరించారని..మాకు న్యాయం చేయాలంటూ వేడుకున్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న జిల్లా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈక్రమంలో మాపైనే పోలీసులకు ఫిర్యాదు చేస్తావా? అంటూ కుల పెద్దలు సదరు కుటుంబంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. అంతటితో ఊరుకోకుండా బాధితుల ఇంటిపై దాడికి దిగారు. ఇల్లంతా చిందరవందర చేసి ఇంట్లో ఉండే ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. దాడి విషయం తెలుస్తుందని వారి ఇంట్లో ఉండే సీసీ కెమెరాలను కూడా ధ్వంసం చేశారు. ఈ దాడిలో ఘటనలో 10మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.