Telangana : దళిత బంధు పథకానికి రూ.250 కోట్లు విడుదల

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో దళిత బంధు పథకానికి రూ.250 కోట్లను రాష్ట్రప్రభుత్వం సోమవారం విడుదల చేసింది.

Telangana : దళిత బంధు పథకానికి రూ.250 కోట్లు విడుదల

Telangana

Telangana : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో దళిత బంధు పథకానికి రూ.250 కోట్లను రాష్ట్రప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. ఆర్థికశాఖ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నిధుల విడుదల ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో మొదటి విడతలో భాగంలో హుజూరాబాద్ సహా మరో నాలుగు మండలాల్లో దళిత బంధు అమలుకు ప్రణాళిక సిద్ధం చేసిన విషయం తెలిసిందే.

చదవండి : Dalita Bandhu : ప్రభుత్వ ఉద్యోగులకు కూడా రూ.10లక్షలు

ఇక ఈ నేపథ్యంలోనే కొద్దీ రోజుల క్రితం మొదటివిడతలో హుజూరాబాద్‌కి రూ.1000 కోట్లు విడుదల చేసింది ప్రభుత్వం. అయితే ఇక్కడ ఉపఎన్నిక ఉండటంతో దళిత బంధు పంపిణి నిలిపివేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసింది.

ఇక తాజాగా హుజూరాబాద్ మినహా మిగతా నాలుగు మండలాలకు రూ.250 కోట్లు విడుదల చేసింది. ఖమ్మ జిల్లా చింతకాని మండలానికి రూ.100 కోట్లు, సూర్యాపేట జిల్లా తిర్మలగిరి మండలానికి రూ.50 కోట్లు, నాగర్‌కర్నూలు జిల్లా చారగొండ మండలానికి రూ.50 కోట్లు, కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌ మండలానికి రూ.50 కోట్లు విడుదల చేశారు.

చదవండి : Huzurabad ByPoll : దళితబంధును వెంటనే నిలిపివేయాలి.. ఈసీ ఆదేశం!