Hyd Covid Hospital Beds : తెలంగాణలో బెడ్స్ కొరతపై ప్రభుత్వం దృష్టి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొవిడ్ ఆస్పత్రుల్లో బెడ్స్ పెంచేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో 60 వేల వరకు బెడ్స్ ఉండగా మరిన్ని సిద్ధం చేస్తోంది. ప్రైవేట్ ఆస్పత్రులు సివియర్ పేషెంట్స్‌ని మాత్రమే అడ్మిట్ చేసుకోవాలని ఆదేశాలు జారీచేసింది.

Hyd Covid Hospital Beds : తెలంగాణలో బెడ్స్ కొరతపై ప్రభుత్వం దృష్టి

Telangana Govt Focus Hyd Covid Hospital Beds Shortage

Hyd Covid Hospital Beds Shortage : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొవిడ్ ఆస్పత్రుల్లో బెడ్స్ పెంచేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో 60 వేల వరకు బెడ్స్ ఉండగా మరిన్ని సిద్ధం చేస్తోంది. ప్రైవేట్ ఆస్పత్రులు సివియర్ పేషెంట్స్‌ని మాత్రమే అడ్మిట్ చేసుకోవాలని ఆదేశాలు జారీచేసింది. తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ కేసులు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. గత నెలలో 24 గంటల్లో 10 వేలకు పైగా కేసులు నమోదు అయిన రోజులు కూడా ఉన్నాయి. కానీ మే మొదటి రోజు నుంచి కొంత కేసుల్లో తగ్గుముఖం కనిపిస్తోంది. గత నెలలో లక్ష టెస్టులు కూడా నిర్వహించిన ఆరోగ్య శాఖ… ఇప్పుడు 60వేలు… 70వేలు పరీక్షలు నిర్వహిస్తోంది.

అయితే కరోనా లక్షణాలు ఏమీ లేకుండా పరీక్ష కేంద్రాలకు రావడం వల్ల టెస్ట్ సెంటర్స్ కోవిడ్ కేంద్రాలుగా మారుతున్నాయని అంటున్నారు ఆరోగ్య శాఖ అధికారులు. అందుకే జ్వరం, జలుబు, దగ్గు రాగానే ఆస్పత్రులకు పరిగెత్తవద్దంటున్నారు. తెలంగాణలో మేజర్ కొవిడ్ హాస్పిటల్స్‌లో బెడ్స్ పెంచడంతో పాటు వాటికి ఆక్సిజన్ పైప్ లైన్స్‌ అమరికను కూడా త్వరితగతిన పూర్తి చేస్తున్నారు. గాంధీ ఆసుపత్రిలో ఆక్సిజన్ బెడ్స్, టిమ్స్‌లో కూడా మొత్తం 13 ఫ్లోర్‌లని వినియోగంలోకి తెచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే 8 ఫ్లోర్‌లు వినియోగిస్తున్నారు. మరో రెండ్రోజుల్లో మిగితా అన్ని బెడ్స్‌ని కూడా ఆక్సిజన్ బెడ్స్‌గా మార్చి వినియోగించనున్నట్టు వైద్యాధికారులు వెల్లడించారు.

మరోవైపు ప్రైవేట్ ఆస్పత్రుల్లో మందులను ఇష్టానుసారం రాస్తున్నారని… దీని వల్ల మంచి జరగకపోగా… నష్టం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు. కొవిడ్‌ రోగులను చికిత్స విషయంలో ప్రైవేట్‌ ఆసుపత్రులకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. సివియర్ లక్షణాలు ఉన్న వారిని మాత్రమే చేర్చుకోవాలని స్పష్టంగా ఆదేశించింది. ఆక్సిజన్‌ 94 శాతం కంటే ఎక్కువుంటే హోం ఐసోలేషన్‌లో ఉంచాలని… ప్రైవేట్ ఆసుపత్రుల్లో పడకల సంఖ్య వివరాలను ఎప్పటికప్పుడు బహిరంగంగా ఉంచాలని సూచించింది. కొవిడ్‌ చికిత్సకు అనుమతులు లేని ఆసుపత్రులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొవిడ్‌ రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే… వేటు తప్పదన్నారు అధికారులు.