High Court Orders On Pubs : హైదరాబాద్‌లో పబ్స్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు.. రాత్రి 10 గంటలు దాటితే సౌండ్‌ వినిపించొద్దని సీరియస్ వార్నింగ్

హైదరాబాద్‌లోని పబ్స్‌పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. ఎక్సైజ్‌, పోలీస్‌ శాఖలను కాస్త గట్టిగానే మందలించిన న్యాయస్థానం.. పబ్బులకు మాత్రం సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చింది. రాత్రి 10 గంటలు దాటిన తర్వాత.. పబ్బుల్లో సౌండ్‌ వినిపించొద్దని తేల్చి చెప్పింది. రాత్రి 10 గంటల నుంచి.. ఉదయం 6 గంటల వరకు పబ్బుల్లో ఎలాంటి సౌండ్‌ పెట్టవద్దని.. సిటీ పోలీస్‌ యాక్ట్‌, నాయిస్‌ పొల్యూషన్‌ రెగ్యులేషన్‌ ప్రకారం లౌడ్ స్పీకర్లకు నిర్దేశిత లిమిట్ వరకే న్యాయస్థానం అనుమతిచ్చింది.

High Court Orders On Pubs : హైదరాబాద్‌లో పబ్స్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు.. రాత్రి 10 గంటలు దాటితే సౌండ్‌ వినిపించొద్దని సీరియస్ వార్నింగ్

High Court Orders On Pubs (1)

High Court Orders On Pubs : హైదరాబాద్‌లోని పబ్స్‌పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. ఎక్సైజ్‌, పోలీస్‌ శాఖలను కాస్త గట్టిగానే మందలించిన న్యాయస్థానం.. పబ్బులకు మాత్రం సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చింది. రాత్రి 10 గంటలు దాటిన తర్వాత.. పబ్బుల్లో సౌండ్‌ వినిపించొద్దని తేల్చి చెప్పింది. రాత్రి 10 గంటల నుంచి.. ఉదయం 6 గంటల వరకు పబ్బుల్లో ఎలాంటి సౌండ్‌ పెట్టవద్దని.. సిటీ పోలీస్‌ యాక్ట్‌, నాయిస్‌ పొల్యూషన్‌ రెగ్యులేషన్‌ ప్రకారం లౌడ్ స్పీకర్లకు నిర్దేశిత లిమిట్ వరకే న్యాయస్థానం అనుమతిచ్చింది.

హైదరాబాద్‌లో విచ్చలవిడిగా పెరిగిపోతున్న పబ్‌ కల్చర్‌పై.. హైకోర్టు సీరియస్‌ అయింది. అసలు.. పబ్‌లకు ఎలా అనుమతిస్తున్నారని ఆరా తీసింది. ఎక్సైజ్‌ రూల్స్‌ ప్రకారం ఇళ్లు, స్కూళ్లు ఉన్న ప్రదేశాల్లో పబ్‌లకు ఎలా అనుమతి ఇచ్చారని న్యాయస్థానం ప్రశ్నించింది. ఏ అంశాలను పరిగణలోకి తీసుకుని.. పబ్‌లకు అనుమతిచ్చారో తెలిపేలా.. ఎక్సైజ్‌ శాఖ కౌంటర్‌ దాఖలు చేయాలంది. అటు.. పోలీసులకు హైకోర్టు నోటీసులిచ్చింది. నగరంలో ఎన్ని పబ్‌లకు పోలీసుల అనుమతులు ఉన్నాయని ప్రశ్నించింది.

Pubs-Bars : నిబంధనలు ఉల్లంఘిస్తే పబ్స్, బార్ల లైసెన్స్ రద్దుతోపాటు సీజ్ : ఎక్సైజ్ కమిషనర్

నగరంలో లౌడ్ స్పీకర్లకు అనుమతులు లేని పబ్‌లు ఎన్ని ఉన్నాయో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. సౌండ్‌ నిబంధనలు ఉల్లంఘించిన పబ్‌లపై నమోదైన కేసులపైనా న్యాయస్థానం ఆరా తీసింది. ఎన్ని కేసులు పెట్టాలో తెలపాలని ఆదేశించింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్లకు హైకోర్టు నోటీసులు పంపింది. రెండు వారాల్లోగా ఈ కేసులో పిటిషన్‌ దాఖలు చేయాలని ఎక్సైజ్‌, పోలీస్‌ శాఖలను ఆదేశించింది.