Telangana : శాతవాహన యూనివర్శిటీలో ఎలుగుబంటి సంచారం..భయాందోళనలో విద్యార్థులు

శాతవాహన యూనివర్శిటీలోని లేడీస్ హాస్టల్ వద్ద ఎలుగుబంటి కనిపించటంలో విద్యార్థినిలు భయాందోళనలకు గురి అయ్యారు.

Telangana : శాతవాహన యూనివర్శిటీలో ఎలుగుబంటి సంచారం..భయాందోళనలో విద్యార్థులు

Bear Tension In Satavahana University Karimnagar

bear tension In Satavahana University Karimnagar : కరీంనగర్ జిల్లాలోని శాతవాహన యూనివర్శిటీలో ఎలుగు బంటి సంచారం కలకలం సృష్టించింది. యూనివర్సిటీలో గర్ల్స్ హాస్టల్ గేటు ముందు వెళ్తోన్న ఎలుగు బంటిని ఓ విద్యార్థినిలు గుర్తించారు.. వెంటనే తన సెల్ ఫోన్ లో వీడియో తీసింది. వెంటనే యూనివర్శిటీ అధాకారులకు ,అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటీన వర్శిటీకి చేరుకున్న అటవీశాఖ అధికారులు ఎలుగు బంటి జాడ కోసం వర్శిటీ ప్రాంగణంలో జల్లెడ పడుతున్నారు. వర్శిటిలో ఉన్న చిట్టడవిలో రెండు బావులున్నాయి. ఈ బావుల వద్దకు ఎలుగు బంట్లు నీటి కోసం వస్తుంటాయని అంచనా వేశారు. దీంతో వర్శిటీ ప్రాంగంలో ఎలుగు బంట్లు సంచారం ఏఏ ప్రాంతాల్లో ఉందో గుర్తిస్తున్నారు. వాటిని వెంటనే పట్టుకుంటామని విద్యార్దులు ఎటువంటి భయాందోళనలకు గురి కావద్దని భరోసా ఇచ్చారు.

Also read : Telangana assembly : అసెంబ్లీలో ఇంట్రెస్టింగ్ సీన్.. ఎమ్మెల్యే రసమయి మాట్లాడుతుండగా మైక్ కట్ చేసిన డిప్యూటీ స్పీకర్

శుక్రవారం (మార్చి 11,2022) ఉదయం మూడున్నర నాలుగు గంటల ప్రాంతంలో హాస్టల్ ముందు కుక్కల అరుపులు వినబడడంతో అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది ఎలుగుబంటిని చూసి వెంటనే గేట్లు మూసివేశారు. గతంలో కరీంనగర్ పట్టణంలోకి వన్యమృగాలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి.

కరీంనగర్ గతంలో ఒక చిన్న పట్టణంలా ఉండేది. చుట్టుపక్కల విస్తారమైన అడవులు, భారీ గుట్టలతో ఉండేది. ఇప్పుడు డెవలప్ మెంట్ జరుగుతుండటంతో కొండలు, గుట్టలతో పాటు చెట్లు కూడా మాయం అవుతున్నారు. ఆ అడవుల్లో జీవించే జంతువులకు దిక్కుతోచని విధంగా అయిపోయింది. ఆహారం కోసం నీటి కోసం అల్లాడుతున్నారు. ఇలా నీళ్ల కోసం జనావాసాల్లోకి వస్తున్న ఘటనలు జరుగుతున్నాయి.

Also read : Chief Justice NV Ramana : హైదరాబాద్ లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ భవనం.. భూమిపూజ చేసిన చీఫ్ జస్టిస్ ఎన్.వి రమణ

కాగా కరీంనగర్ లో గ్రానైట్ క్వారీల వల్ల చుట్టూ ఉన్న గుట్టలు క్రమక్రమంగా మాయమవడం మొదలయ్యాయి. గ్రానైట్ తవ్వకాలతో ఒక్కోక్క గుట్ట మాయం అవుతోంది. పర్యావరణ శాఖ నుంచి కానీ ఇటు అటవీశాఖ నుంచి కానీ ఎలాంటి చర్యలు లేకపోవడంతో దాదాపు 25 కిలోమీటర్ల ప్రాంతం వరకూ వన్యప్రాణులకు ఉండేందుకు అవకాశాలు లేకుండా పోవడంతో ఎలుగుబంట్లు, చిరుతపులులు, కోతులు, నెమళ్లు లాంటి అనేక అడవి మృగాలు, పక్షులు పట్టణంలోకి ప్రవేశించడం మొదలైంది.

ప్రస్తుతం ఉన్న శాతవాహన యూనివర్సిటీ ఒకప్పుడు అడవిలాగానే ఉండేది.ఇక్కడ 200 ఎకరాల్లో శాతవాహన యూనివర్సిటీ ప్రారంభించడంతో దీనికి సంబంధించిన భూములను పూర్తిస్థాయిలో కాపాడుకోవడానికి ప్రహరీగోడతో పాటు పలు భవనాలను నిర్మించారు. దీంట్లో భాగంగానే గర్ల్స్ హాస్టల్ సైతం ప్రధాన బిల్డింగ్ కి పడమర వైపుగా నిర్మించారు. అయితే ఇక్కడ దాదాపు 300 మంది విద్యార్థినులు ఉంటున్నారు. ఎలుగుబంటి సంచారం గురించి తమకు తోటి విద్యార్థినుల ద్వారా సమాచారం అందడంతో భయపడ్డామని హాస్టల్ విద్యార్థినులు చెబుతున్నారు.

Also read : BJP New Target: తెలుగు రాష్ట్రాలపై కమలం గురి..!

మరోవైపు ప్రత్యక్షంగా సంఘటన జరిగిన సమయంలో అక్కడ ఉండి ఆ ఎలుగుని చూశానని, కుక్కల అరుపులతో ఎలుగుబంటి చెరువు ఉన్న ప్రాంతం వైపు పారిపోయిందని సెక్యూరిటీగా డ్యూటీలో ఉన్న వ్యక్తి తెలిపాడు. ఇప్పటికే దీనికి సంబంధించి ఫారెస్ట్ రేంజ్ అధికారులు, పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేశామని విద్యార్థినులు, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రిజిస్ట్రార్ వరప్రసాద్ అంటున్నారు. అలాగే ఎలుగు బంటి గురించి ఆందోళన పడవద్దని దాన్ని పట్టుకోవటానికి అన్ని ఏర్పాట్లు చేశామని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.