Paddy Procurement : ఇండియా గేట్ ముందు బియ్యం పారబోస్తాం…కేంద్రానికి తెలంగాణ మంత్రుల అల్టిమేటం

కేంద్రం 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని, దానికంటే అదనంగా వచ్చే ధాన్యం తీసుకుంటామని హామీ ఇవ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన అదనపు ధాన్యాన్ని బియ్యం పట్టించి ఢిల్లీ ఇండియా గేట

Paddy Procurement : ఇండియా గేట్ ముందు బియ్యం పారబోస్తాం…కేంద్రానికి తెలంగాణ మంత్రుల అల్టిమేటం

Ts Ministers Delhi Tour

Paddy Procurement :  తెలంగాణలో ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్ర మంత్రులతో చర్చించేందుకు ఢిల్లీ వెళ్లిన తెలంగాణమంత్రుల పర్యటన ముగిసింది. కేంద్రానికి మరో రెండు రోజుల సమయం ఇచ్చి మంత్రులు తెలంగాణకు తిరుగుపయనమయ్యారు. ఖరీఫ్‌లో పండే వరి ధాన్యం కొనుగోలు పై కేంద్రానికి అల్టిమేటం జారీ చేసారు. ఖరీఫ్ సీజన్‌లో అదనపు ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి.. రైతులకు డబ్బు చెల్లిస్తుందని మంత్రులు తెలిపారు. కేంద్రం 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని, దానికంటే అదనంగా వచ్చే ధాన్యం తీసుకుంటామని హామీ ఇవ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన అదనపు ధాన్యాన్ని బియ్యం పట్టించి ఢిల్లీ ఇండియా గేట్ ముందు పారబోస్తామని..కేంద్ర వైఖరిపై రెండు రోజులు వేచి చూసి మళ్ళీ ఢిల్లీ వస్తామనిమంత్రులు తెలిపారు.

వారం రోజులుగా ఢిల్లీలో ఉన్నా ఖరీఫ్ పంట ఎంత వస్తే అంత కొంటామన్న అంశంపై లిఖిత పూర్వక హామీ ఇవ్వలేదని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయి… మేము కొనుగోలు కేంద్రాలు ఉంచాలా వద్దా అనే అంశాన్ని కేంద్రం స్పష్టంగా చెప్పడం లేదని ఆయన అన్నారు. వచ్చే యాసంగి నుంచి తెలంగాణలో కొనుగోలు కేంద్రాలు ఉండవు అని మంత్రితెలిపారు.

పీయూష్ గోయల్ చాలా అబద్దాలు చెప్పారు..గత యాసంగి ధాన్యం ఇంకా ఇవ్వలేదన్నారు. ధాన్యం ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది..ఎఫ్‌సీఐ ధాన్యం తీసుకు వెళ్లడం లేదని మంత్రి వివరించారు. మిల్లర్ల నుంచి బియ్యం తీసుకు వెళ్లాలని కేంద్రానికి 7 లేఖలు రాశాం… తెలంగాణలోని ఎఫ్‌సీఐ గోదాములు నిండిపోయాయి..ఏపీ జగ్గయ్యపేటలో గోదాముల ఖాళీగా ఉన్నా ఇవ్వలేదు….కర్ణాటక బీదర్‌లో 10 వేల టన్నుల ధాన్యం నిల్వ చేసే గోదాము ఖాళీగా ఉన్నా ఇవ్వలేదు…. ఈ నెల 6 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఇస్తామంటే కేవలం 3 లక్షల టన్నుల బియ్యం మాత్రమే తీసుకువెళ్లారని గంగుల వివరించారు.  గోదాముల ఇవ్వకుండా కేంద్రం రాష్ట్రాన్ని ఇబ్బందులు పెడుతోందని…బియ్యం తీసుకువెళ్లడం లో కేంద్ర నిర్లక్ష్యం వహిస్తోందని గంగుల ఆరోపించారు.

Also Read : Raja Singh: రాజాసింగ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. జిల్లాలకు వారి పేర్లు పెడతాం!

వర్షాకాలం ధాన్యం సేకరణ కోసం ఢిల్లీ వస్తే …వచ్చే యాసంగి పంట గురించి పదే పదే కేంద్ర మంత్రి చెప్పడాన్ని రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఖండించారు. తెలంగాణలో వర్షాకాలం పంట కొనుగోళ్లు 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం టార్గెట్ పూర్తయిందని….60 లక్షలకు పైగా వచ్చే దాన్యాన్ని కూడా తీసుకుంటామన్న లిఖిత పూర్వక హామీ కోసం ఢిల్లీలో ఉన్నా కేంద్ర మంత్రి స్పందించలేదని ఆయన చెప్పారు. కేంద్రం లిఖితపూర్వక హామీ ఇవ్వకపోవడం దురదృష్టకరమని …ఇది రైతుల విషయం…తొందరలో కేంద్రం నుంచి లేఖ వస్తుందని భావిస్తున్నామని మంత్రి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

తొమ్మిది రోజులు ధాన్యం కొనుగోళ్ల అంశానికి సంభందించి పార్లమెంట్ లో ఆందోళన చేసినా కేంద్రం పట్టించుకోక పోవటంతో పార్లమెంట్ సమావేశాలు బహిష్కరించామని టీఆర్ఎస్ లోక్ సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు చెప్పారు. తెలంగాణ రైతులను కేంద్రం అవమానిస్తోందని…ఆహార బద్రత చట్టం కింద దేశంలో ధాన్యం సేకరించడం కేంద్రం భాద్యతఅని ఆయన చెప్పారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం ఒకటి రెండు రోజుల్లో స్పష్టత ఇవ్వాలని నామా డిమాండ్ చేశారు.