Telangana : నేటి నుంచి హెల్త్ ప్రొఫైల్ పైలట్ ప్రాజెక్టు.. ఒక్క క్లిక్‌‌తో ఆరోగ్య సమాచారం

ఎవరికి వారే హెల్త్ అకౌంట్‌ను వెబ్‌సైట్‌లో క్రియేట్ చేసుకునే వెసులుబాటు ఈ పోర్టల్‌ కల్పిస్తుంది. ఫోన్ నంబర్, ఆధార్ నెంబర్‌తో హెల్త్ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఆధార్ నంబర్

Telangana : నేటి నుంచి హెల్త్ ప్రొఫైల్ పైలట్ ప్రాజెక్టు..  ఒక్క క్లిక్‌‌తో ఆరోగ్య సమాచారం

Health

Health Profile Scheme : తెలంగాణలో నేటి నుంచి హెల్త్ ప్రొఫైల్ పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం కానుంది. హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్ట్‌ని ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్నారు. ములుగులో మంత్రి హరీశ్ రావు, సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ ప్రారంభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కేంద్రం తలపెట్టిన నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్‌లో భాగంగా హెల్త్ అకౌంట్లను రూపొందించనున్నారు. కేంద్రం తెచ్చిన పోర్టల్‌నే రాష్ట్ర హెల్త్ ప్రొఫైల్ కోసం వాడుకోనున్నారు. ఎవరికి వారే హెల్త్ అకౌంట్‌ను వెబ్‌సైట్‌లో క్రియేట్ చేసుకునే వెసులుబాటు ఈ పోర్టల్‌ కల్పిస్తుంది. ఫోన్ నంబర్, ఆధార్ నెంబర్‌తో హెల్త్ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఆధార్ నంబర్ మాదిరిగానే.. ఒక యూనిక్ నంబర్ కేటాయిస్తారు. ఇదే హెల్త్ అకౌంట్ నంబర్ లేదా హెల్త్ ఐడీగా ఉపయోగపడుతుంది.

Read More : Health Mission : ప్రతి పౌరుడి ఆరోగ్య రికార్డుకు రక్షణ, వైద్య విద్యలో సంస్కరణలు – మోదీ

అనారోగ్యంతో ఏదైనా హాస్పిటల్ వెళ్లినప్పుడు ఈ ఐడీ చెబితే సరిపోతుంది. ఒకవేళ ఐడీ లేకపోతే… మన వివరాలు తీసుకుని హాస్పిటల్ వాళ్లే ఐడీ క్రియేట్ చేసి ఇస్తారు. ఇందుకోసం హాస్పిటళ్ల యాజమాన్యాలు, డాక్టర్లతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం పూర్తయితే ప్రతి హాస్పిటల్లో హెల్త్ అకౌంట్ జనరేషన్ హెల్ప్ డెస్క్‌లు అందుబాటులోకి వస్తాయి. మంత్రుల పర్యటనకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేశారు. రేడియాలజీ ల్యాబ్ భవన నిర్మాణాలకు మంత్రి హరీశ్ రావు శంకుస్థాపన చేశారు. పిల్లల ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. నర్సంపేట, పరకాల నియోజకవర్గాల్లో హరీశ్ రావు పర్యటించనున్నారు. సిరిసిల్ల జిల్లాలో వేములవాడలో తిప్పాపూర్ సర్వేకు మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. వేములవాడ ఏరియా ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్, పాలియేటివ్ కేర్ సెంటర్లను కేటీఆర్ ప్రారంభిస్తారు.

Read More : PM Modi : ఒక్క క్లిక్ చేస్తే..మీ ఆరోగ్య సమాచారం

సిరిసిల్ల జిల్లాలో 245, ములుగు జిల్లాలో 153 హెల్త్ టీమ్స్ ను ఏర్పాటు చేశారు. ఈ సర్వే ప్రక్రియ ఏప్రిల్ చివరి నాటికి ముగించాలనే లక్ష్యం పెట్టుకున్నారు. ఒక్కో టీం రోజుకి 40 మందిపై సర్వే చేయనుంది. ప్రతి టీమ్ ఇంటింటికి తిరిగి ఆధార్ కార్డు నెంబర్, ఫోన్ నెంబర్ తీసుకుని వివరాలను ఆరోగ్య తెలంగాణ ఈ హెల్త్ ప్రొఫైల్ యాప్ లో ఎంటర్ చేసి.. అప్పటికప్పుడు హెల్త్ ప్రొఫైల్ అకౌంట్ క్రియేట్ చేస్తుంది. అనంతరం ఎత్తు, బరువు కొలుస్తారు. ఏవైనా ఆరోగ్య సమస్యలున్నాయా ? అడిగి తెలుసుకోనున్నారు. బీపీ, షుగర్, టీబీ, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే వాటి వివరాలను సేకరిస్తారు. ఈ సందర్భంగా హెల్త్ టీమ్ కు రెండు బ్యాగులను అందచేశారు. అందులో వైద్య పరికరాలు, కరోనా వైరస్ కు సంబంధించిన వస్తువులు ఉండనున్నాయి.