టెన్షన్ టెన్షన్ : తెలంగాణ కరోనా @ 154 కేసులు

  • Published By: madhu ,Published On : April 3, 2020 / 12:38 AM IST
టెన్షన్ టెన్షన్ : తెలంగాణ కరోనా @ 154 కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కోరలు చాస్తోంది. ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. క్రమక్రమంగా కేసులు అధికమౌతుండడం సర్వత్రా ఆందోళప వ్యక్తమైతోంది. 2020, ఏప్రిల్ 02వ తేదీ గురువారం ఒక్కరోజే 27 కేసులు కొత్తగా నమోదయ్యాయి. దీంతో బాధితుల సంఖ్య 154కు పెరిగింది. ప్రస్తుతం 128 మంది వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ మహమ్మారి కారణంగా 9 మంది చనిపోయిన సంగతి తెలిసిందే.

ఢిల్లీ నుంచి వచ్చిన వారు, వారి ఫ్యామిలి మెంబర్స్, సన్నిహితులను కలుపుకుని బుధ, గురువారాల్లో 1,061 మంది నమూనాలు సేకరించి ల్యాబ్ కు పంపించారు. వీటిని పరీక్షించడానికి  రాష్ట్రంలో అనుమతించిన అన్ని ప్రయోగశాలతో పాటు సీసీఎంబీకి కూడా పంపించారు. 2020, ఏప్రిల్ 03వ తేదీ శుక్రవారం వీటి ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇందులో ఎక్కువ సంఖ్యలో పాజిటివ్ కేసులు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

బాధితుల సంఖ్య పెరిగితే..అందుకనుగుణంగా చికిత్సకు ఏం చేయాలని వైద్య మంత్రి ఈటల రాజేందర్ ఉన్నతాధికారులతో చర్చించారు. ఢిల్లీ మర్కజ్ నుంచి వచ్చిన వారు ఎవరైనా ఉంటే..104కు ఫోన్ చేయాలని, లేకపోతే..సమీపంలోని ఆసుపత్రుల్లో చేరాలని సూచిస్తున్నారు. ఏప్రిల్ 14 వరకు ప్రభుత్వ ఆదేశాలు పాటించాలని, ఎవరూ కూడా ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని వెల్లడిస్తున్నారు. 

ఢిల్లీ..ప్రకంపనలు..
ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారి నుంచి సేకరించిన నమూనాల్లో అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్ సహా దాదాపుగా అన్ని జిల్లాలోనూ బుధ, గురువారాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. 

Also Read | పడవలోనే తిండి.. అక్కడే పండి.. నీళ్లలోనే క్వారంటైన్