నిమ్స్ ఆస్పత్రిలో మొదటి దశ క్లినికల్ ట్రయల్స్ సక్సెస్..14 రోజుల అబ్జర్వేషన్ తర్వాత రెండో డోస్

10TV Telugu News

హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో మొదటి దశ క్లినికల్ ట్రయల్స్ విజయవంతం అయ్యాయి. నిన్న ఇద్దరు వాలంటీర్లకు వ్యాక్సిన్ ఇచ్చిన వైద్యులు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకపోవడంతో డిశ్చార్జ్ చేశారు. ఇక 14 రోజుల అబ్జర్వేషన్ తర్వాత రెండో డోస్ ఇవ్వనున్నట్లు వైద్యులు చెబుతున్నారు. రక్త నమూనాలు సేకరించిన మిగతా వారికి కూడా మొదటి డోస్ ఇవ్వనున్నట్లు నిమ్స్ వైద్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.

భారత్ బయోటెక్, ఐసీఎమ్మార్ సంయుక్తంగా నిర్వహిస్తున్న క్లినికల్ ట్రయల్స్ దేశ వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. 12 సెంటర్లలో కొనసాగుతున్నాయి. తెలంగాణకు సంబంధించి నిమ్స్ ఆస్పత్రిలో క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి. కోవ్యాక్సిన్ కు సంబంధించి నిన్న మొదటి దశ డోసేజ్ ను ఇద్దరు వాలంటీర్లకు ఇచ్చారు. వారికి ఇప్పటికే రక్త నమూనాలను సేకరించి బ్లడ్ టెస్టులన్నీ చేసిన తర్వాత ఐసీఎమ్మార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక మొదటి దశ డోసేజ్ కూడా వారికి ఇచ్చారు. ఈ వ్యాక్సిన్ కు సంబంధించి మొదటి డోసేజ్ ఇద్దరు వాలంటీర్లకు ఇచ్చారో అది విజయవంతం అయింది.

ఎందుకంటే ఇప్పటివరకు వారికి ఎలాంటి రియాక్షన్స్, సైడ్ ఎఫెక్ట్స్ గానీ లేకుండా ఇవాళ కొద్ది సేపటి క్రితమే డిశ్చార్జ్ అయినట్లు నిమ్స్ వైద్యులు చెబుతున్నారు. మిగతా వారు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే నిమ్స్ ఆస్పత్రి వైద్యులు, ఐసీయూ బ్లాక్, ఫార్మాకాలజీ డిపార్ట్ మెంట్ 26 మంది రక్త నమూనాలు సేకరించారు. ఈ 26 మందిలో నిన్న ఇద్దరికి ఇవ్వగా మిగతా వారిపై కూడా ప్రయోగం జరిపేందుకు ఐసీఎమ్మార్ గ్రీన్ సిగ్నల్ రావాల్సివుంది.

ఇవాళ సక్సెస్ అయిన ఈ ఇద్దరిని చూసిన తర్వాత మళ్లీ మిగతా వారిపై కూడా మొదటి డోస్ ను ఎక్కించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈరోజు డిశ్చార్జ్ అయిన ఇద్దరినీ అబ్జర్వేషన్ లో పెట్టేందుకు డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించారు. 14 రోజులపాటు వీరిని అబ్జర్వేషన్ లో ఉంచిన తర్వాత వీరి ఆరోగ్య పరిస్థితిని పూర్తిగా క్షుణ్ణంగా ఇటు ఫార్మికాలజీ డిపార్ట్ మెంట్ అటు అస్పత్రి వర్గాలు కూడా అబ్జర్వేషన్ లో పెడతారు. తర్వాత వారికి ఎట్లాంటి ఎన్ ఫెక్షన్స్ లేకుండా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటే కనుక 14 రోజుల తర్వాత సెకండ్ డోసేజ్ కూడా ఇవ్వడానికి నిమ్స్ ఆస్పత్రి వర్గాలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.

నిజానికి కోవ్యాక్సిన్ కు సంబంధించి మొత్తం ఐదు దశలు ఉంటాయి. 0 నుంచి 4 అంటే 5 డోసేజ్ లు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. రెండు డోసేజ్ లు ఇవ్వడానికి మాత్రమే ఐసీఎమ్మార్…నిమ్స్ ఆస్పత్రికి రెండు డోసేజ్ ల అనుమతి ఇచ్చిందని నిన్న ఫార్మాకాలజీ డిపార్ట్ మెంట్ వైద్యులు చెప్పారు. 14 రోజుల తర్వాత రెండో దశ డోసేజ్ ఎక్కించినట్లైతే అప్పుడు కూడా ఎట్లాంటి రియాక్షన్స్ లేకుండా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటే కనుక ఐసీఎమ్మార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేంతవరకు కూడా వారిని అబ్జర్వేషన్ లో ఉంచుతారు. ఆ తర్వాత మూడో దశ గురించి ఐసీఎమ్మార్ చెప్పాల్సివుంటుంది.

ఇటు భారత్ బయోటెక్ ఇప్పటికే ఆగస్టు 15కు ఈ వ్యాక్సిన్ తీసుకొస్తామని చెప్పారు. ఆ తర్వాత ఐసీఎమ్మార్ నుంచి ఇది అక్టోబర్ వరకు కూడా వ్యాక్సిన్ వచ్చే అవకాశాలున్నాయని చెబుతున్నారు. క్లినికల్ ట్రయల్స్ ప్రాసెస్ జరగడానికి కనీసం మూడు నాలుగు నెలల సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

రెండు దశలకు సంబంధించి నిమ్స్ పర్మీషన్ ఉండటంతో 14 రోజుల తర్వాత ఇద్దరు పేషెంట్స్ కు, మిగతా వారికి ఫస్ట్ డోసేజ్ ఇచ్చిన తర్వాత దాదాపు 15 నుంచి 20 రోజుల తర్వాత రెండు డోస్ లకు సంబంధించి కూడా ఇస్తారు. దాని తర్వాత మళ్లీ రెండో డోస్ కు సంబంధించిన అబ్జర్వేషన్ 15 రోజులు.. దాదాపు నెలపాటు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది.