Jubileehills Girl Rape : జూబ్లీహిల్స్ బాలిక గ్యాంగ్ రేప్ కేసు..మైనర్ల కష్టడీకి అనుమతి

ఐదుగురు నిందితులను కస్టడీలోకి తీసుకొని జూబ్లీహిల్స్ పోలీసులు విచారించనున్నారు. రేపటి నుండి జువెనల్ హోమ్ లోనే మైనర్లను పోలీసులు విచారణ చేయనున్నారు.

Jubileehills Girl Rape : జూబ్లీహిల్స్ బాలిక గ్యాంగ్ రేప్ కేసు..మైనర్ల కష్టడీకి అనుమతి

Custody

Jubileehills girl rape : జూబ్లీహిల్స్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో మైనర్లను కస్టడీలోకి తీసుకోవడానికి జువైనల్ కోర్ట్ అనుమతి ఇచ్చింది. ఐదు రోజుల పాటు కస్టడీలోకి తీసుకోవడానికి అనుమతి ఇచ్చింది. 5 మంది మైనర్లలో ముగ్గురిని కష్టడీలోకి తీసుకోవడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. మరో ఇద్దరి కష్టడీ కోసం జూబ్లీహిల్స్ పోలీసులు పిటిషన్ వేశారు.

ఐదుగురు నిందితులను కస్టడీలోకి తీసుకొని జూబ్లీహిల్స్ పోలీసులు విచారించనున్నారు. రేపటి నుండి జువెనల్ హోమ్ లోనే మైనర్లను పోలీసులు విచారణ చేయనున్నారు. న్యాయవాది సమక్షంలో నిందితులను పోలీసులు విచారణ చేసి స్టేట్ మెంట్ రికార్డ్ చేయనున్నారు. అయతే పోలీస్ యూనిఫామ్ లేకుండా వెళ్లి విచారణ చేయాలని జువైనల్ కోర్ట్ ఆదేశించింది.

Jubilee Hills Girl Rape : జూబ్లీహిల్స్ బాలిక అత్యాచార కేసు..కీలక విషయాలు వెల్లడించిన సాదుద్దీన్ మాలిక్

మరోవైపు ఈ కేసులో ఏ 1 నిందితుడు సాదుద్దీన్ మాలిక్ మొదటి రోజు కస్టడీ విచారణ చేశారు. సాదుద్దీన్ మాలిక్ ను పోలీసులు 6 గంటలు పాటు విచారించారు. సాదుద్దీన్ మాలిక్ స్టేట్ మెంట్ ను రికార్డ్ చేశారు. విచారణలో మాలిక్ పలు కీలక అంశాలు వెల్లడించారు. విచారణలో అదనపు వెస్ట్ జోన్ డీసీపీ ఇక్బాల్ సిద్దికీ మరియు ఐఓ అధికారికి మాలిక్ సహకరించారు. సిసి కెమెరా ఫుటేజ్ కాల్ డేటా ముందు ఉంచి పోలీసులు విచారించారు.  విచారణలో సాదుడిన్ మాలిక్ ఐఓ అధికారికి సంచలన విషయాలు వెల్లడించారు.

మైనర్ లతో తనకి రెండు నెలల ఫ్రెండ్ షిప్ ఉంది. వక్ఫ్ బోర్డు చైర్మన్ కొడుకుతో నేను ఇన్నోవా కారులో పబ్ కి వచ్చాను. మమల్ని జమిల్ అనే ఇన్నోవా డ్రైవర్ పబ్ వద్దకు తీసుకువచ్చాడు. మొదట బాలికను వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ కొడుకు కలిశాడు. ఆ తరవాత నేను అనుసరించాను. బాలిక బయటకు వచ్చిన అనంతరం నాతో పాటు మైనర్లు పరిచయం చేసుకున్నాము. ఇంటి వద్ద డ్రాప్ చేస్తామని చెప్పడంతో బాలిక మాతో పాటు బెంజ్ కారులో వచ్చింది. ఇన్నోవా కారు పబ్ వద్ద పార్క్ చేసి జమీల్ అనే డ్రైవర్ వెళ్ళి పోయాడు.

Jubilee Hills Gang Rape Case : జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. మరోసారి బాలిక స్టేట్‎మెంట్ రికార్డు.. కీచకులను గుర్తించింది

అనంతరం అమ్మాయితో మైనర్లు బెంజ్ కారులో ఉండగా నేను ఇన్నోవా కారులోనే బెంజ్ కారు వెనుకే అనుసరించాను. సాదూద్దీన్ మాలిక్ ను ఈ నెల 3న రిమాండ్ చేసే సమయంలో చెప్పిన 8 పేజీల స్టేట్ మెంట్ విషయాలను ఇటీవలే బాలిక రెండవ సారి స్టేట్ మెంట్ ఇచ్చింది. ఈ నెల 7న ఇద్దరు మైనర్ లు ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా మాలిక్ ను పోలీసులు పలు కోణాల్లో విచారించారు.

రేపు రెండవ రోజు సాదుద్దీన్ మాలిక్ ను ఐ ఓ బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్ విచారణ చేయనున్నారు. మొదటిరోజు విచారణలో సాదుధ్ధూన్ మాలిక్ సహకరించలేదు. పోలీసుల ప్రశ్నలకు దాటవేసే సమాధానం చెప్పారు. రేపు రెండవరోజు కస్టడిలో భాగంగా పోలీసులు విచారించనున్నారు. రేపు ముగ్గురు మైనర్స్ ను విచారించనున్నారు. జువైల్ హోంలోనే కస్టడి విచారణ సాగనుంది. ఐదురోజుల పాటు మైనర్స్ కస్టడి విచారణకు కోర్టు అనుమతి ఇచ్చింది.