Traffic restrictions: నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు.. ఏఏ ఏరియాల్లో అంటే..

హైదరాబాద్ లో రేపు, ఎల్లుండి ప్రధాని మోదీ పర్యటించనున్నారు.  మాధాపూర్ హెచ్‌ఐసిసి లో జరిగే భాజపా కార్యవర్గ సమావేశానికి మోదీతో పాటు  కేంద్ర, ముఖ్యమంత్రులు, ప్రముఖులు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యవర్గ సమావేశాలు నిర్వహించే ప్రాంతాల్లోనూ, మోదీ బస చేసే ప్రాంతాలు, 3న బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే బహిరంగ సభ ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

Traffic restrictions: నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు.. ఏఏ ఏరియాల్లో అంటే..

Traffic Police

Traffic restrictions: హైదరాబాద్ లో రేపు, ఎల్లుండి ప్రధాని మోదీ పర్యటించనున్నారు.  మాధాపూర్ హెచ్‌ఐసిసి లో జరిగే భాజపా కార్యవర్గ సమావేశానికి మోదీతో పాటు  కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రముఖులు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యవర్గ సమావేశాలు నిర్వహించే ప్రాంతాల్లోనూ, మోదీ బస చేసే ప్రాంతాలు, 3న బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే బహిరంగ సభ ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

Strong Security: భద్రతా వలయంలో మోదీ పర్యటించే ఏరియాలు.. మెట్రో సేవలు బంద్..

మోదీ పర్యటించే ప్రాంతాల్లో ఇప్పటికే పలు కార్యాలయ వేళల్లో మార్పులు చేసుకోవాలని సిటీ పోలీసులు సూచించారు. కావూరి హిల్స్ నుంచి కొత్తగూడ జంక్షన్, హైటెక్ సిటీ ఎంఎంటీఎస్‌‌‌‌ స్టేషన్, ఐకియా రోటరీ మధ్య ఉండే ఆఫీసుల టైమింగ్స్‌‌‌‌ మార్చుకోవాలని సూచించారు. వర్క్‌‌‌‌ఫ్రం హోంకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. భారీ వాహనాలుకు అనుమతి లేదని స్పష్టం చేశారు. హెచ్‌‌‌‌ఐసీసీ పరిసర ప్రాంతాల్లో ఐదు ట్రాఫిక్‌‌‌‌ కంట్రోల్‌‌‌‌ బూత్ లను ఏర్పాటు చేస్తున్నారు.

PM Modi: 3న బీజేపీ బహిరంగ సభ.. మోదీ ఉండే స్టేజీపై ఏడుగురికే అనుమతి

ఆంక్షలు ఉండే రూట్లు ఇవే..

– నీరూస్‌‌‌‌ జంక్షన్ నుంచి సైబర్ టవర్స్‌‌‌‌ మీదుగా కొత్తగూడ జంక్షన్, గచ్చిబౌలి జంక్షన్ వైపు వెళ్లే ట్రాఫిక్ ను మాదాపూర్‌‌‌‌‌‌‌‌ సీఓడీ జంక్షన్ వద్ద డైవర్ట్‌‌‌‌ చేస్తారు. అక్కడ లెఫ్ట్‌‌‌‌ టర్న్ తీసుకొని దుర్గంచెరువు, ఇనార్బిట్ మాల్, ఐటీసీ కోహినూర్, ఐకియా జంక్షన్ వద్ద లెఫ్ట్‌‌‌‌ తీసుకుని బయోడైవర్సిటీ జంక్షన్​కు చేరుకోవాలి. అక్కడి నుంచి రైట్‌‌‌‌ తీసుకుని గచ్చిబౌలి జంక్షన్ మీదుగా కొత్తగూడ ట్రావెల్‌‌‌‌ చేయాలి.

– మియాపూర్, హఫీజ్​పేట్, కొండాపూర్‌‌‌‌‌‌‌‌ నుంచి హైటెక్​సిటీ, సైబర్ టవర్స్ మీదుగా జూబ్లీహిల్స్ వైపు వెళ్లే వాహనాలు కొత్తగూడ జంక్షన్, బొటానికల్ గార్డెన్, ఏఐజీ హాస్పిటల్, ఐకియా, ఇనార్బిట్ మాల్, దుర్గం చెరువు, సీఓడీ జంక్షన్ నుంచి జూబ్లీహిల్స్ వెళ్లాలి.

– ఆర్సీపురం, చందానగర్, లింగంపల్లి నుంచి మాదాపూర్ వైపు వెళ్లే వాహనాలు ఆల్విన్ ఎక్స్‌‌‌‌రోడ్, కొండాపూర్ మీదుగా వెళ్లకుండా బీహెచ్ఈఎల్, నల్లగండ్ల, హెచ్​సీయూ, ఐఐఐటీ జంక్షన్ నుంచి గచ్చిబౌలి మీదుగా కొండాపూర్ మళ్లించనున్నారు.

– జేఎన్టీయూ నుంచి సైబరాబాద్, మియపూర్ నుంచి కొత్తగూడా. అదేవిధంగా కావూరి హిల్స్ నుంచి కొత్తగూడా, బయోడైవర్సిటీ నుంచి జేఎన్టీయూ వరకు, నారాయనమ్మ కళాశాల నుంచి గచ్చిబౌలి మార్గాల్లో భారీ వాహనాలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు.  వాహన దారులు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో ఉంచుకొని సహకరించాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కోరారు.