TRS MLAs Trap Issue : టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు రూ.100 కోట్ల డీల్? దీని వెనుకున్నది వారేనా?

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం వెనుకున్నది ఎవరు? అనేది హాట్ టాపిక్ గా మారింది. ఈ మొత్తం వ్యవహారంలో హైదరాబాద్ కు చెందిన నందకుమార్ అనే వ్యక్తి మెయిన్ క్యాండిడేట్ గా తెలుస్తోంది. ఢిల్లీ నుంచి వచ్చిన ఒక స్వామీజీ, లోకల్ గా ఉండే నందు(నందకుమార్) ఈ ఆపరేషన్ మొత్తం ఆపరేట్ చేసినట్లుగా పోలీసులు తెలుసుకున్నారు.

TRS MLAs Trap Issue : టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు రూ.100 కోట్ల డీల్? దీని వెనుకున్నది వారేనా?

TRS MLAs Trap Issue : మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ కు కొద్ది సమయానికి ముందు కలకలం రేగింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపింది. భారీ ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు ఆపరేషన్ ఆకర్ష్ గుట్టు రట్టు చేశారు.

కాగా, ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం వెనుకున్నది ఎవరు? అనేది హాట్ టాపిక్ గా మారింది. ఈ మొత్తం వ్యవహారంలో హైదరాబాద్ కు చెందిన నందకుమార్ అనే వ్యక్తి మెయిన్ క్యాండిడేట్ గా తెలుస్తోంది. ఢిల్లీ నుంచి వచ్చిన ఒక స్వామీజీ, లోకల్ గా ఉండే నందు(నందకుమార్) ఈ ఆపరేషన్ మొత్తం ఆపరేట్ చేసినట్లుగా పోలీసులు తెలుసుకున్నారు.

గువ్వల బాలరాజు, పైలెట్ రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, బీరం హర్షవర్దన్ రెడ్డితో బేరసారాలు చేశారని, రామచంద్ర భారతి ద్వారా సంప్రదింపులు జరిపినట్లు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

అధికారిక పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులను ప్రలోభ పెట్టి పార్టీలో చేర్చుకునే ఆపరేషన్ గురించి పోలీసులకు ముందే సమాచారం అందింది. మొయినాబాద్ ఫామ్ హౌస్ కేంద్రంగా ఎమ్మెల్యేలకు ఎర వేశారు. ప్రజా ప్రతినిధులతో డీల్ చేసేందుకు స్వామీజీలు ఢిల్లీ నుంచి వచ్చారని పోలీసులు వెల్లడించారు.

మునుగోడు ఎన్నికలకు ముందు మరోసారి ఓటుకు నోటు సీన్ రిపీట్ అయ్యిందని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఢిల్లీ కేంద్రంగానే ఈ కుట్ర జరిగినట్లు వారు ఆరోపిస్తున్నారు. కుట్రను విజయవంతంగా తిప్పి కొట్టామంటున్నారు టీఆర్ఎస్ నేతలు. పోలీసులకు సమాచారం ఇచ్చి మరీ ఫామ్ హౌస్ కు వెళ్లారు ఎమ్మెల్యేలు. డీల్ జరగబోతున్న సమయంలో సైబరాబాద్ పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. టీఆర్ఎస్ రివర్స్ ఆపరేషన్ తో మీడియేటర్లు అడ్డంగా బుక్కయ్యారు. పోలీసుల ఎంట్రీతో వారు షాక్ తిన్నారు. ఎమ్మెల్యేలకు డబ్బు ఆఫర్ చేస్తూ మీడియేటర్లు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు.