TSRTC: మహిళా ప్రయాణికులకు శుభవార్త.. వారి కోసం ప్రత్యేక బస్సు

సాయంత్రం 5:45 గంటలకు కొండాపూర్ నుంచి అదే మార్గంలో కోఠికి వస్తుంది. మహిళా ప్రయాణికులు ఈ సదుపాయాన్ని వినియోగించుకుని క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ఆర్టీసీ కోరుతున్నట్లు సజ్జనర్ పేర్కొన్నారు.

TSRTC: మహిళా ప్రయాణికులకు శుభవార్త.. వారి కోసం ప్రత్యేక బస్సు

TSRTC: హైదరాబాద్ నగరంలోని మహిళా ప్రయాణికులకు ఆర్టీసీ శుభవార్త చెప్పింది. కోఠి-కొండాపూర్ మార్గంలో లేడీస్ స్పెషల్ బస్సును ఏర్పాటు చేస్తున్నట్లు ఆ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ శుక్రవారం వెల్లడించారు. 127K నంబర్ గల ప్రత్యేక బస్సు ఈ నెల 21 (సోమవారం) నుంచి ప్రారంభం కానుందట. ప్రతి రోజు ఉదయం 8.50 గంటలకు కోఠి నుంచి బయలుదేరి.. లక్దికాపుల్, మసబ్ ట్యాంక్, ఎమ్మెల్యే కాలనీ, ఉషా కిరణ్, గుట్టల బేగంపేట, శిల్పారామం, కొత్తగూడ ఎక్స్ రోడ్స్ మీదుగా కొండాపూర్ కి వెళ్తుందని తన ఎక్స్(ట్విటర్) ఖాతా ద్వారా సజ్జనార్ తెలిపారు.

Man Posts Hilarious Tweet : జెప్టో కంపెనీ జాబ్ ఆఫర్‌పై వైరల్ అవుతున్న యువకుడి ట్వీట్

ఇక తిరుగు ప్రయాణం.. సాయంత్రం 5:45 గంటలకు కొండాపూర్ నుంచి అదే మార్గంలో కోఠికి వస్తుంది. మహిళా ప్రయాణికులు ఈ సదుపాయాన్ని వినియోగించుకుని క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ఆర్టీసీ కోరుతున్నట్లు సజ్జనర్ పేర్కొన్నారు.