Munugode By PoLL : కోమటిరెడ్డిని ‘కోవర్టు రెడ్డి’ అని కేటీఆర్ అందుకే అన్నారు : వీహెచ్

కోమటిరెడ్డిని కోవర్టు రెడ్డి అని కేటీఆర్ అందుకే అన్నారు అలా అనటం సరైనదే అనిపిస్తోంది అన్నట్లుగా కాంగ్రెస్ సీనియర నేత వీహెచ్ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ లో ఉంటూనే బీజేపీ తరపున పోటీలో ఉన్న తన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓట్లు వేసి గెలిపించాలని చెప్పటం సరికాదంటూ మండిపడ్డారు వీహెచ్.అందుకే వెంకట్ రెడ్డిని మంత్రి కేటీఆర్ కోవర్టు రెడ్డి అన్నారని అన్నారు.

Munugode By PoLL : కోమటిరెడ్డిని ‘కోవర్టు రెడ్డి’ అని కేటీఆర్ అందుకే అన్నారు : వీహెచ్

V.Hanumantha Rao defends KTR's 'Covertu Reddy' comments

Munugode By PoLL : కోమటిరెడ్డిని కోవర్టు రెడ్డి అని కేటీఆర్ అందుకే అన్నారు అలా అనటం సరైనదే అనిపిస్తోంది అన్నట్లుగా కాంగ్రెస్ సీనియర నేత వీహెచ్ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ లో ఉంటూనే బీజేపీ తరపున పోటీలో ఉన్న తన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓట్లు వేసి గెలిపించాలని చెప్పటం సరికాదంటూ మండిపడ్డారు వీహెచ్.అందుకే వెంకట్ రెడ్డిని మంత్రి కేటీఆర్ కోవర్టు రెడ్డి అన్నారని అన్నారు. కన్నతల్లిలాంటి కాంగ్రెస్ కోమటిరెడ్డి బ్రదర్స్ కు ఎన్నో పదవులిచ్చిందని..కానీ విశ్వాసం లేకుండా ఇలా వ్యవహరించటం సరికాదంటూ ఆవేదన వ్యక్తం చేశారు వీహెచ్.

తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం సర్వశక్తులుఒడ్డి శ్రమపడుతోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్ళక పోకపోవడటమ కాదు తెలంగాణలోనే ఉండకుండా ఏకంగా ఆస్ట్రేలియా చెక్కేశారు. పైగా తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి (బీజేపీ అభ్యర్థి)నే గెలిపించాలని వ్యాఖ్యానించారు. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంత రావు మండిపడ్డారు. తమ్ముడేమో కన్నతల్లిలాంటి పార్టిని వదిలి బీజేపీలోకి వెళ్లిపోయి ఆ పార్టీనుంచే పోటీ చేస్తున్నాడని..ఇప్పుడు అన్నేమో తమ్ముడినే గెలిపించాలని కోరటం సరికాదన్నారు. తమ్ముడిపై ప్రేమతోనే వెంకట్ రెడ్డి ప్రచారం చేయకుండా విదేశాలు వెళ్లిపోయారని..వెళ్లినవాడు ఊరికే ఉండకుండా తన తమ్ముడిని గెలిపించాలని అనటం సరికాదన్నారు. ఇది కన్నతల్లిలాంటి కాంగ్రెస్ కు ద్రోహం చేయటమేన్నారు. ఇలా మోసం చేయటం సరికాదన్నారు. కోమటిరెడ్డిని అందుకే మంత్రి కేటీఆర్ కోవర్టు రెడ్డి అన్నారని అన్నారు వీహెచ్.

KTR-Komatireddy Venkatareddy : ‘కోవర్టు రెడ్లు’ అంటూ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్‌కు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కౌంటర్

గతంలో కూడా వీహెచ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ను వీడటానికి చేసే యత్నాలను ఆపాలని యత్నించారు. ఇంటికెళ్లి మరీ నచ్చచెప్పారు. అన్నదమ్ములు వేరు వేరు పార్టీల్లో ఉండటం కొత్త కాదని ఎన్నో విధాలుగా నచ్చచెప్పారు. కానీ రాజగోపాల్ వినలేదు. బీజేపీలో చేరారు. దీంతో మునుగోడుకు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలోనే బీజేపీ రాజగోపాల్ నే పోటీలో నిలబెట్టింది.

కాగా.. కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా ఉండి ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా విదేశాలకు వెళ్లిపోవటంపై కూడా వీహెచ్ అసహనం వ్యక్తంచశారు. వెంకట్ రెడ్డిపై విహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.వెంకట్ రెడ్డి ఇలాంటి ప్రవర్తన వల్ల టిఆర్ఎస్ నేతలు కోవర్టు రెడ్డి అంటున్నారని..వెంకట్ రెడ్డి మునుగోడు ప్రచారానికి వెళ్ళక పోతే కోవర్టు రెడ్డి అనేది నిజమౌతుందని అన్నారు బేఖాతరు చేయకుండా వెళ్లిపోయారు వెంకట్ రెడ్డి. వెంకట్ రెడ్డిని ఆపటానికి వీహెచ్ అన్ని ప్రయత్నాలు చేశారు. స్వయంగా వెంకట్ రెడ్డిని కలిసే ప్రయత్నం చేసినా కలవలేదని వాపోయారు వీహెచ్. కనీసం ఫోన్ చేస్తే లిఫ్ట్ కూడా చేయలేదని వెంకటరెడ్డి తీరు మార్చుకోవాలని చేతులు జోడించి అడుగుతున్నానని విహెచ్ వేడుకున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా వెంకట్ రెడ్డి వీడియో వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తున్నాయి. ఐదుసార్లు ఎమ్మెల్యేగా చేశా..ఇప్పుడు ఎంపీగా ఉన్నా అవసరమైతే రాజీకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటానంటూ చేసిన వ్యాఖ్యలు ఆయన అన్నింటికి సిద్దపడే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని..తెలుస్తోంది.