Telangana Congress : మాణిక్కం ఠాగూర్‌‌కు వీహెచ్ లేఖ

తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ కి మాజీ ఎంపీ హనుమంతరావు లేఖ రాశారు. బీజేపీ ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులను మొదటినుండి సోనియాగాంధీ వ్యతిరేకిస్తూ వస్తున్నారని, 9 రోజుల పాటు తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జరిగితే ఒక్కరోజు కూడా CLP నేత భట్టి విక్రమార్క ఈ విషయంపై మాట్లాడలేదని లేఖలో ప్రస్తావించారు.

Telangana Congress : మాణిక్కం ఠాగూర్‌‌కు వీహెచ్ లేఖ

Vh Congress

V Hanumantha Rao : తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ కి మాజీ ఎంపీ హనుమంతరావు లేఖ రాశారు. బీజేపీ ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులను మొదటినుండి సోనియాగాంధీ వ్యతిరేకిస్తూ వస్తున్నారని, 9 రోజుల పాటు తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జరిగితే ఒక్కరోజు కూడా CLP నేత భట్టి విక్రమార్క ఈ విషయంపై మాట్లాడలేదని లేఖలో ప్రస్తావించారు. సీఎల్పీ లీడర్ ఈ విషయం మాట్లాడటంలో పూర్తిగా విఫలమయ్యారని తెలిపారు.

జేసీ దివాకరరెడ్డి సీఎల్పీ ఆఫీస్ లో కాంగ్రెస్ గురించి తప్పుగా మాట్లాడితే కూడా ఎవరు స్పందించలేదన్నారు. దీనిపై విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకోవాలని, కనీసం రానున్న సమావేశాల్లోనైనా రైతు చట్టాల గురించి మాట్లాడాలని లేఖలో వీహెచ్ కోరారు.

టీపీసీసీ చీఫ్ ఎంపిక విషయంలో కూడా గతంలో వీహెచ్ పలు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణలో పీసీసీ అధ్యక్షుడి ప్రకటనకు ముందు..సీనియర్ నాయకులతో మాట్లాడి అభిప్రాయాలు తీసుకోవాలంటూ..మాణిక్కం ఠాగూర్‌కు వీహెచ్ లేఖ కూడా రాశారు. 2023 ఎన్నికలే లక్ష్యంగా పార్టీని బలోపేతం చేయాల్సి ఉందని, ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదంటూ అసహనం వ్యక్తం చేశారాయన.

Read More : TPCC : నేడే టీపీసీసీ చీఫ్ ఎంపిక ప్రకటన ?